అన్వేషించండి

SouthWest Monsoon: కూల్ న్యూస్ చెప్పిన ఐఎండీ - కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే?

IMD: దేశ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. గురువారం ఉదయం నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

SouthWest Monsoon Hits Kerala: ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) కూల్ న్యూస్ అందించింది. నైరుతి రుతుపవనాలు (South Western Monsoon) గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. కేరళ (Kerala) సహా ఈశాన్య రాష్ట్రాలను నైరుతి పవనాలు తాకినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు చెప్పారు. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. నాలుగైదు రోజుల్లో రుతు పవనాలు రాయలసీమలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. వారం ముందుగానే రుతుపవనాల పురోగమనంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈసారి ముందుగానే నైరుతి పవనాలు కేరళను తాకాయి.

ఎందుకంత ప్రత్యేకం.?

దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో 52 శాతం నికర సాగుభూమికి ఇప్పటికీ వర్షపాతమే ఆధారమే. ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడి అవుతాయి. అటు, ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం, ఆగస్ట్ - సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న క్రమంలో ఈసారి సీజన్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు గత నెలలోనే అంచనా వేశారు. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1951 నుంచి 2023 వరకూ ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని.. ఈ ఏడాది కూడా రుతుపవనాలు కదలిక అనుకూలంగా ఉందని వివరించారు.

సాధారణంగా ఈశాన్య భారతంలో జూన్ 5కు అటు, ఇటుగా రుతు పవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 30నే ప్రవేశించాయి. రేమాల్ తుఫాను ప్రభావంతో రుతు పవనాలు వేగంగా కేరళను తాకినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.

Also Read: Agnibaan: ఇస్రో మరో ఘనత - నింగిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget