UPSC Civils Results 2024: 2024 యూపీఎస్సీ ఫలితాల్లో కేటగిరివారీగా కటాఫ్ ఎంత?
UPSC Civils Results 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2024 కటాఫ్ వివరాలను కమిషన్ ప్రకటించింది. ఏ కేటగిరికి ఎంత కటాఫ్ ఉందో ఇక్క తెలుసుకోండి.

UPSC Civils Results 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీస్ పరీక్ష 2024 ఫైనల్ ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. IAS, IPS, IFS వంటి ప్రతిష్టాత్మక సేవలలో ఎంపిక కావాలని సంవత్సరాలుగా కలలు కంటున్న లక్షలాది యువతీ యువకుల కృషి ఫలించింది. ఫలితాల తర్వాత, అభ్యర్థుల దృష్టి కట్‌ఆఫ్ మార్కులపై ఉంది, ఇవి ఎంపిక ఏ ర్యాంకు వరకు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి పోస్టు వస్తుందనే వివరాలు తెలుసుకునేందుకు ఉపయోపడుతుంది. అందుకే కటాఫ్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని దశల్లో కటాఫ్‌లను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో విడుదల చేశారు.
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కట్‌ఆఫ్ ఎంత ఉందో తెలుసుకోండి
UPSC CSE 2024 ప్రలిమ్స్ పరీక్షలో ఓపెన్ కేటగిరి (General) కి కట్‌ఆఫ్ 87.98 మార్కులు, ఇది ఇటీవలి సంవత్సరాలకు అనుగుణంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. OBC వర్గానికి 87.28 మార్కులు, EWS కు 85.92 మార్కులు, SC వర్గానికి 79.03 మార్కులు , ST వర్గానికి 74.23 మార్కులను కటాఫ్‌గా తేల్చారు. ఈ సంఖ్యలు ప్రిలిమ్స్ పరీక్షలో కూడా కేటగిరీల వారీ పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి.
సివిల్స్ మెయిన్స్ పరీక్ష కేటగిరీల వారీగా కట్‌ఆఫ్
ప్రధాన పరీక్ష (Mains) లో కట్‌ఆఫ్ మార్కులు మరింత ఆసక్తిగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరికి మెయిన్స్ పరీక్ష కట్‌ఆఫ్ 729 మార్కులు, EWS కు 696, OBC కు 702, SC వర్గానికి 685, ST వర్గానికి 684 మార్కులు నిర్ణయించారు. .
ఫైనల్ ఎంపికకు కటాఫ్ ఇదే
ఫైనల్ కట్‌ఆఫ్లో ఇంటర్వ్యూ మార్కులు కూడా ఉన్నాయి, ఓపెన్ కేటగరికి 947 మార్కులు. ఇది ఎంపిక చివరి దశను సూచిస్తుంది, దీని ఆధారంగా అభ్యర్థులకు సేవలు కేటాయిస్తారు. వారి ర్యాంకును నిర్ణయిస్తారు. .
టాపర్స్‌లో శక్తి దూబే నంబర్ 1
ఈసారి ప్రయాగరాజ్‌కు చెందిన శక్తి దూబే మొదటి స్థానం సాధించారు. రెండో స్థానంలో హర్షిత గోయల్ , మూడో స్థానంలో డోంగ్రే అర్చిత్ పరాగ్ ఉన్నారు. టాప్ 5లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఢిల్లీకి చెందిన ఆకాశ్ గర్గ్ ఐదో స్థానం పొందారు. ఈ ఏడాది 2845 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు, వారిలో 1009 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో ఓపెన్ కేటగిరికి 335, OBC కు 318, EWS కు 109, SC వర్గానికి 160 , ST వర్గానికి 87 మంది అభ్యర్థులు ఉన్నారు.
పంక్చర్లు వేసే వ్యక్తి కుమారుడు సివిల్స్ విజేత
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చే విభిన్న కథలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా నివాసి ఇక్బాల్ అహ్మద్ 998వ ర్యాంకు సాధించాడు. ఇక్బాల్ చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి మక్బూల్ అహ్మద్ సైకిల్ పంక్చర్ రిపేర్ షాపును నడిపేవాడు. ఆరోగ్య సమస్యల కారణంగా, అతని దుకాణం రెండేళ్ల క్రితం మూసేశారు.
ఐదుగురు సంతానంలో ఇక్బాల్ ఒకడు. ముగ్గురు సోదరులు పెయింటర్లుగా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన ఇక్బాల్ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. మెహదావాల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించి ఉన్నత విద్య కోసం గోరఖ్‌పూర్‌కు వెళ్లాడు. చిన్నప్పటి నుంచి చదువులో తెలివైనవాడైన ఇక్బాల్‌కు ప్రయాణం అంత సులభం కాదు, కానీ దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని సాధించాడు.





















