అన్వేషించండి

I.N.D.I.A. Politics: I.N.D.I.A. కూటమికి మరో షాక్! గుడ్ బై చెప్పేసిన మరో కీలక పార్టీ - త్వరలోనే ఎన్డీఏలోకి!

Betas to the Alliance: ఇండియా కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ షాకిచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. త్వరలోనే ఆయన ఎన్డీఏలో చేరే అవకాశం ఉంది

Another shock for Congress: సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా (I.N.D.I.A.) కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్(Nithsh Kumar) జారిపోగా...దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా (Farooq Abdullah) ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి చేయిజారిపోవడంతో..ఇక మిగిలిన కూటమి సభ్యులు ఏమాత్రం కలిసికట్టుగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే.

కశ్మీర్ పార్టీ ఔట్..

ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్నికల ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జమ్ము, కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అలియన్స్ నుంచి బయటకు వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్వతహాగా పోటీ చేస్తామన్నారు.

ఎన్డీఏ గూటికి..!

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ(BJP)ని గద్దె దించేందుకు ఏర్పడిన ఇండియా కూటమికి అనతికాలంలోనే బీటలు వారాయి. కూటమి నుంచి ఒక్కో కీలక పార్టీ బయటకు పోతోంది. ఇప్పటికే జేడీయూ(JDU) చీఫ్ ఎన్డీఏ(NDA)తో జతకట్టగా...మరో కీలక భాగస్వామి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamatha Benarge) సైతం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అటు అరవింద్ కేజ్రివాల్(Aravind Kejriwal) సైతం కూటమిపట్ల సుముఖంగా లేరు. ఇక అఖిలేష్ యాదవ్ సంగతి సరేసరి. ఇలా ఒక్కొక్కరూ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్(Congress) దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఖచ్చితంగా తమతోనే ఉంటారని భావించిన మరో కీలక పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సైతం చేయిచ్చింది. సీట్ల సర్దుబాటు, ప్రధాని అభ్యర్థిపై ఎటూ తేల్చకపోవడం వల్లే ఒక్కొక్కరూ పార్టీ వీడుతున్నట్లు సమాచారం. అయితే ఫారూక్ సైతం ఎన్డీఏ(NDA)లో చేరడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. తర్వలోనే ఆయన ఎన్డీఏలో చేరే అవకాశాలను కొట్టిపారేయలేం.

400 సీట్లపై గురి

రానున్న లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతోపాటు 400 సీట్లపై కన్నేసిన కమలం పార్టీ..అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. పాతమిత్రులకు మరోసారి స్నేహహస్తం అందిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబు(CBN)ను చర్చలకు ఆహ్వానించింది. నేడో రేపో తెలుగుదేశం(TDP) సైతం ఎన్డీఏలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు మరో పాత మిత్రుడు ఫారుక్ అబ్దుల్లాకు వలవేసింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి ఎత్తివేయడంతోపాటు..లద్దాక్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై కశ్మీర్ పార్టీలు బీజేపీపట్ల గుర్రుగా ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ సామ, దాన, భేద దండోపాయాలన్నీ ప్రయోగించి ఒక్కొక్కరినీ దారిలోకి తెచ్చుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఫారుక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. దీని ఫలితమే ఆయన ఎన్డీఏలోకి రానున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget