Bharat Bandh Protest Strike: బుధవారం భారత్ బంద్ - స్కూళ్లు, బ్యాంకులు ఉంటాయా ? ఇవిగో డీటైల్స్
Bharat Bandh Protest Strike Reason: బుధవారం భారత్ బంద్ పాటిస్తున్నారు కార్మికులు, బ్యాంకులు, స్కూళ్లు ఉంటాయా లేవా అన్నదానిపై అనేక మందికి సందేహాలు ఉన్నాయి.

Bharat Bandh Will banks schools be open : బుధవారం దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మిక సంఘాలు బంద్ ప్రకటించాయి. పాతిక కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు, రైతులు ఈ బంద్ లో పాల్గొంటారని చెబుతున్నారు. ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంత ఉంటుందన్నదానిపై అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టత లేదు కానీ.. గతంలో జరిగిన బంద్ ల ప్రభావం చూస్తే..స్వల్పంగా ఉండే అవకాశం ఉంది.
బ్యాంకులకు సెలవు లేదు కానీ పని చేయవు !
బ్యాంకులకు ఎలాంటి సెలవు లేదు. అయితే ఉద్యోగులంతా బంద్ లో పాల్గొంటున్నారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలన్నీ బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఈ కారణంగా బ్యాంకులు పని చేయవు. బ్యాంకుల ముందు ఉద్యోగులు నిరసనలు చేపట్టే అవకాశం ఉంది. అందుకే బుధవారం బ్యాంకులతో పని ఉన్న వారు గురువారానికి వాయిదా వేసుకోవచ్చు.
స్కూళ్ల బంద్ ఉండదు !
ప్రభుత్వ స్కూల్ టీచర్ సంఘాలు.. ఈ బంద్ కు మద్దతుపై తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల సంఘాలు లోకల్ గానే బలంగా ఉంటాయి. బంద్‌లపై వారే నిర్ణయం తీసుకంటారు. ఇప్పటి వరకూ వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్ బంద్ .. ప్రభుత్వ స్కూళ్లపై ప్రభావం స్వల్పంగానే చూపించే అవకాశం ఉంది.
ప్రైవేటు స్కూల్స్ యుథావిదిగా నడిచే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూల్స్ బంద్ పాటించే అవకాశం లేదు. సాధారణంగా విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే మాత్రం బంద్ పాటిస్తారు. వారు దాడులు చేస్తారన్న భయంతో మూసేస్తారు. కానీ ఇప్పుడు భారత్ బంద్ టీచర్లు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు టీచర్లు జాతీయ స్థాయి కార్మిక సంఘాల్లో సభ్యులుగా ఉండరు. పైగా స్కూల్ యాజమాన్యాల ఒత్తిడి ఉంటుంది.అందుకే భారత్ బంద్ ఎఫెక్ట్ ప్రైవేట్ స్కూల్స్ పై ఉండే అవకాశం లేదు.
ఆర్టీసీ బస్సులు నడుస్తాయా ?
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లోని కార్మికులు రోజంతా బంద్ లో పాల్గొనే అవకాశాల్లేవు. మహా అయితే ఓ అరగంట నిరసన చేపట్టి మళ్లీ విధుల్లో చేరుతారు. దాని వల్ల బస్సులు యథావిధిగా నడిచే అవకాశాలు ఉన్నాయి.
పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు మూతపడే అవకాశం ఉంది పోస్టల్ సేవలు, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ కార్యకలాపాలు, ప్రభావితం కావచ్చు. రాష్ట్ర రవాణా సంస్థలు, పబ్లిక్ బస్సులు, టాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. NMDC వంటి సంస్థలు , స్టీల్, హైవే కన్స్ట్రక్షన్ రంగాలలో కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. 27 లక్షలకు పైగా విద్యుత్ కార్మికులు సమ్మెలో పాల్గొననున్నందున, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. అధికారికంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేదు. కానీ స్థానిక నిరసనల కారణంగా కొన్ని ప్రాంతాలలో అంతరాయాలు ఉండవచ్చని భావిస్తున్నారు.





















