India on Covid-19 Vaccines: 'మైత్రి 2.0'.. 4 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన భారత్
పొరుగు దేశాలకు వ్యాక్సిన్ సరఫరాను భారత్ పునరుద్ధరించింది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇరాన్ దేశాలకు వ్యాక్సిన్లు పంపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
భారత్.. మరోసారి పొరుగు దేశాలకు వ్యాక్సిన్ సరఫరాను పునఃప్రారంభించింది. నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇరాన్ దేశాలకు తాజాగా కరోనా టీకాలను సరఫరా చేసినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇటీవలే మోదీ సర్కార్.. టీకా సరఫరాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి పక్క దేశాలకు మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగిచీ వెల్లడించారు.
వ్యాక్సిన్ సరఫరాను విదేశాంగ శాఖ నిరంతరం సమీక్షిస్తున్నట్లు బగిచీ వెల్లడించారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇరాన్‌కు ఇప్పటికే వ్యాక్సిన్లు చేరినట్లు బగిచీ అన్నారు. దేశంలోని ఉత్పత్తి, డిమాండ్ ఆధారంగా తర్వాతి సరఫరాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు బగిచీ.
భారత్‌లో అదనంగా ఉన్న కొవిడ్ టీకాలను 'వ్యాక్సిన్ మైత్రి' కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.
Also Read: CBSE Term-1 board exams: 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక ప్రకటన.. పరీక్షలు ఎప్పుడంటే?
Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు
Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'
Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం