Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు
మోదీ సర్కార్‌పై ఎంపీ వరుణ్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
భాజపా జాతీయ కార్యదర్శుల జాబితా నుంచి తన పేరు తొలిగించిన తర్వాత తొలిసారి ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు ఎంపీ వరుణ్ గాంధీ. మాజీ ప్రధాని వాజ్‌పేయీ ప్రసంగాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వంపై వాజ్‌పేయీ విమర్శలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. రైతులకు మద్దతుగా వాజ్‌పేయీ అందులో మాట్లాడారు. ఆ వీడియోకు "హృదయం ఉన్న మహానేత మాట్లాడిన తెలివైన మాటలు" అని వరుణ్ గాంధీ క్యాప్షన్ పెట్టారు.
Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx
— Varun Gandhi (@varungandhi80) October 14, 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తోన్న పోరాటానికి వరుణ్ గాంధీ మద్దతు పలికారు.
రైతు నిరసనలకు మద్దతుగా..
లఖింపుర్ ఘటనను ఉపయోగించుకుని హిందువులు, సిక్కుల మధ్య విబేధాలు సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు భాజపా నేత వరుణ్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అంతకుముందు లఖింపూర్ ఘటనపై వరుణ్ గాంధీ స్పందిస్తూ, నిరసనకారులపైకి కారు దూసుకెళ్లిన వీడియోను పోస్ట్ చేశారు. నిరసనకారుల గళాన్ని హత్యల ద్వారా నొక్కకూడదన్నారు. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీతనం ఉండాలని ట్వీట్ చేశారు. రైతులకు న్యాయం చేయాలన్నారు.
లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు సిక్కులు ఉన్నారు. బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర సింగ్ సిక్కులకు గుర్ముఖి లిపిలో ఓ లేఖ రాశారు. ఈ సంఘటన అనంతరం సంయమనం పాటించినందుకు సిక్కులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘటనను ప్రభుత్వం, ప్రజలు సహా అందరూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం