CBSE Term-1 board exams: 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక ప్రకటన.. పరీక్షలు ఎప్పుడంటే?
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది.
10,12వ తరగతి విద్యార్థులకు టెర్మ్ 1 బోర్డ్ పరీక్షల డేట్ షీట్లను అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. 2021 నవంబర్- డిసెంబర్ మధ్యలో పరీక్షలు ఉంటాయని పేర్కొంది. పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఆఫ్‌లైన్‌లో ఉండనున్నాయని ఒక్కో పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించనున్నట్లు వెల్లడించింది.
Term-1 board exams for Classes 10, 12 to be conducted offline; date-sheet to be announced on October 18: CBSE
— Press Trust of India (@PTI_News) October 14, 2021
రెండు గ్రూపులుగా..
10, 12వ తరగతుల సబ్జెక్టులను రెండు గ్రూపులుగా విభజించింది బోర్డు. మైనర్, మేజర్ సబ్జెక్టులుగా రెండు గ్రూపులను ఏర్పాటు చేసింది. మొత్తం 189 పేపర్లకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించనుంది. అయితే 10, 12వ తరగతికి సంబంధించిన అన్నీ సబ్జెక్టులకు ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే 40-45 రోజుల సమయం పట్టనున్నట్లు పేర్కొంది. అందుకే మొదటగా మైనర్ సబ్జెక్టులకు అనంతరం మేజర్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
2022లో టర్మ్ 2 పరీక్షలు..
టర్మ్ 2 పరీక్షలు 2022 మార్చి- ఏప్రిల్ మధ్య నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. అయితే సెకండ్ టర్మ్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ సహా వివరణాత్మక ప్రశ్నలు ఉండనున్నాయి.
కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా గత ఏడాది 10,12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. అయితే ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా ఫలితాలను వెల్లడించింది. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది సీబీఎస్ఈ బోర్డు. కరోనా థర్డ్ వేవ్ భయాల వేళ పరీక్షలను అనుకున్న రీతిలో జరపాలని బోర్డు ఆలోచిస్తోంది.
Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు
Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'
Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!
Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం