అన్వేషించండి

Covaxin: కొవాగ్జిన్‌ సేఫ్‌ కాదన్న రిపోర్ట్‌ని కొట్టిపారేసిన ICMR,అధ్యయనం జరిగిన తీరుపై అనుమానం

Covaxin: కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటూ బనారస్ హిందూ యూనివర్సిటీ ఇచ్చిన రిపోర్ట్‌ని ICMR కొట్టి పారేసింది.

Covaxin News: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయంటూ Banaras Hindu University విడుదల చేసిన రిపోర్ట్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్వయంగా ఆస్ట్రాజెన్‌కా కంపెనీయే సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తాయని అంగీకరించడం కలకలం రేపింది. అప్పటి నుంచి కొవాగ్జిన్ టీకాపైనా (Covaxin Safety) దృష్టి పడింది. తమ వ్యాక్సిన్‌ 100% సేఫ్ అంటూ భారత్ బయోటెక్ కంపెనీ ఓ ప్రకటన కూడా చేసింది. అయితే...ఈ టీకా వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తప్పవని బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు తేల్చిచెప్పారు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో 1% మంది హార్ట్‌అటాక్‌లు వచ్చాయని ఈ అధ్యయనం వెల్లడించారు. మరి కొందరిలో Guillain-Barre Syndrome కూడా కనిపించిందని తెలిపింది ఈ రిపోర్ట్. ఈ సిండ్రోమ్ కారణంగా విపరీతమైన నీరసం, కాళ్లు, నరాల నొప్పులు వస్తాయని వివరించింది. 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకూ అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ తయారు చేసినట్టు వెల్లడించింది. తాము సేకరించిన శాంపిల్స్‌లో 50% మేర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు కనిపించాయని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్‌పైనే ICMR అసహనం వ్యక్తం చేసింది. ఈ రిపోర్ట్‌ తయారు చేసేందుకు అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది. సరైన విధంగా పరిశోధన చేశారా లేదా అన్న అనుమానాలున్నాయని వెల్లడించింది. వాళ్లలో కనిపించే ఆరోగ్య సమస్యల్ని కొవాగ్జిన్‌కి లింక్ చేసి ఎలా చూస్తోందో క్లారిటీగా చెప్పలేదని స్పష్టం చేసింది. 

డేటా కలెక్ట్ చేసిన విధానాన్నీ విమర్శించింది ICMR.కొంత మందికి ఫోన్‌ కాల్ చేసి వివరాలు సేకరించారని వెల్లడించింది. పైగా వ్యాక్సిన్ తీసుకున్న ఏడాది తరవాత కాల్‌ చేసి వాళ్లు ఏది చెబితే అదే రికార్డ్ (Covaxin Side Effects) చేసుకున్నారని మండి పడింది. మెడికల్ రికార్డులతో పోల్చుకుని చూడకుండానే రిపోర్ట్ తయారు చేసిందని విమర్శించింది. అసలు సైడ్‌ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పడానికి ఎలాంటి టెక్నికల్ డేటా ఇవ్వలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఆ ప్రొఫెసర్స్ వెంటనే వాళ్లు అనుసరించిన మెథడాలజీ ఏంటో వెల్లడించాలని తేల్చి చెప్పింది. ఈ రిపోర్ట్‌పై భారత్ బయోటెక్ సంస్థ కూడా స్పందించింది. తమ వ్యాక్సిన్‌లకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని మరోసారి స్పష్టం చేసింది. ఈ రికార్డ్‌కి మచ్చ తెచ్చే విధంగా కొంత మంది ఇలాంటి రిపోర్ట్‌లు విడుదల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే భారత్‌లోని కొందరు ఎక్స్‌పర్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. కొవిడ్ టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అన్ని టీకాల సేఫ్‌టీపైనా రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉన్న సందేహాలు తీరాలంటే ఇలా సమీక్షించడం చాలా కీలకం అని సూచించారు. CoWIN  లెక్కల ప్రకారం భారత్‌లో 17% మేర కొవాగ్జిన్ టీకాలు తీసుకున్నారు. మిగతా వాళ్లంతా కొవిషీల్డ్ తీసుకున్నా వాళ్లే. అందుకే కొవిషీల్డ్‌పై అనుమానాలు వచ్చినప్పటి నుంచి ఆందోళన మొదలైంది. 

Also Read: Iran: ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్బర్ నియామకం, ఆదేశాలు జారీ చేసిన సుప్రీం లీడర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget