Imran Khan : లేస్తే ..మనిషిని కాను..! దిగిపోవాలంటున్న విపక్షాలకు ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక !
పాకిస్థాన్‌లో ఇప్పుడు అనిశ్చిత పరిస్థితి ఉంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అందరూ దిగిపోవలాంటున్నారు. ఆయితే ఇమ్రాన్ మాత్రం అలా అడిగితే... తాము మరింత ప్రమాదకరంగా మారుతానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నాతో పెట్టుకోవద్దు.. నేను లేస్తే మనిషిని కాను అనే డైలాగ్ మన దగ్గర కామన్. కాకపోతే ఈ డైలాగ్ పక్కన అందరూ ... కానీ లేవడు.. అనే క్యాప్షన్ పెట్టుకుంటారు. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అంతే. ఆయన దిగిపోవాలంటూ విపక్షాలు రోడ్డెక్కుతున్నాయి. ఉద్యమం చేస్తున్నాయి. సోమవారం పాకిస్థాన్‌లో విపక్ష పార్టీలన్నీ భారీ ర్యాలీని చేపట్టాయి. దీనికి పెద్ద ఎత్తు ప్రజా స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తోందని పాకిస్థాన్ మీడియా చెబుతోంది. దీంతోఇదేదో చివరికి కుర్చీ దింపేసేలా ఉందే అని కంగారు పడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్... విపక్షాలు ఓ హెచ్చరిక జారీ చేశారు.
Also Read: భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి ఏ దశలో ఉందో తెలుసా.. ఇన్సాకాగ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
తనను దిగిపోవాలని రోడ్డెక్కితే..తాను మరింత ప్రమాదకరంగా మారుతానని హెచ్చరించారు. బీవేర్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్ అనే సందేశం పంపారు. నేను వీధుల్లోకి వస్తే ప్రతిపక్షాలు దాక్కునేందుకు చోటు దక్కదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలందరూ జాతి ద్రోహులుగా ఇమ్రాన్ చెబుతున్నారు. అందరూ దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటున్నాయని, కానీ తాను అందుకు అవకాశమివ్వనని ప్రకటించారు.
అయితే విపక్ష పార్టీలు ఇమ్రాన్ ఖాన్ ప్రకటనను లైట్ తీసుకున్నాయి. "అరిచావని ఆగలేదు... ఇలా అరిస్తే ఎవరూ ఆగరు అని చెప్పడానికి " ఆగమన్నట్లుగా ప్రకటనలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్‌ను మరింత టీజ్ చేస్తున్నారు. ఆయనకు పాలన చేతకాదని పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దిగిపోవాల్సిందేనంటున్నారు.