(Source: ECI/ABP News/ABP Majha)
Omicron Community Spread: భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి ఏ దశలో ఉందో తెలుసా.. ఇన్సాకాగ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
దేశంలో కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి దశలో ఉంది. ఈ విషయాన్ని భారత SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ తాజా రిపోర్టులో వెల్లడైంది.
Omicron In India: దేశంలో గత నాలుగు రోజులుగా 3 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కరోనా మరణాలు సైతం భారీగా నమోదు కావడంతో ప్రజలు వైరస్ విషయంలో మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి (Community Transmission Stage) దశలో ఉంది. ఈ విషయాన్ని భారత SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ లేదా ఇండియన్ SARS-CoV-2 జెనెటిక్స్ కన్సార్టియం (INSACOG) తన తాజా బులెటిన్‌లో తెలిపిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఇన్సాకాగ్ అనేది భారతదేశంలో కొవిడ్19 వ్యాప్తి, వైరస్ సంబంధిత వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి, పర్యవేక్షించడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కింద ఏర్పాటు అయిన ఓ సంస్థ. ఈ ఇన్సాకాగ్ తాజా బులెటిన్ ప్రకారం.. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో పలు మెట్రో నగరాలలో వ్యాపించడంతో పాటు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BA.2 త్వరగా వ్యాప్తి చెందుతుంది. దీనిని 'స్టెల్త్ ఓమిక్రాన్' (stealth Omicron) అని పిలుస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో 530 ఈ వేరియంట్ కేసులు నమోదైనట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.
జనవరి 10 బులెటిన్‌ను ఆదివారం విడుదల చేయగా.. కొవిడ్ బారిన పడుతున్న వారిలో ఆసుపత్రిలో చేరికలు ఎక్కువయ్యాయని, ఐసీయూ కేసులు సైతం గణనీయంగా పెరిగాయని ఇన్సాకాగ్ తెలిపింది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ సామూహిక వ్యాప్తి దశలో ఉందని, తద్వారా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతాయని పీటీఐ రిపోర్ట్ చేసింది. కొత్త మ్యూటేషన్లు ఈ లక్షణాలు ఉండే అవకాశం లేదని, అయితే వీటి ద్వారా కొత్త రకం వేరియంట్లు పుట్టుకొస్తాయని రిపోర్టులో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ తరహాలో మ్యూటేషన్లు ఇందులో ఎక్కువ లేవు. యూకేతో పాటు డెన్మార్క్, ఇండియా, స్వీడన్ మరియు సింగపూర్‌లో ఈ కేసులు విస్తరిస్తున్నాయని ఇదివరకే రిపోర్టులు వచ్చాయి. భారత్‌లోనూ 500కు పైగా BA.2 కేసులు నమోదైనట్లు వెల్లడి కావడంతో వైద్య శాఖ అలర్ట్ అయింది.
ఢిల్లీ, ముంబైలో అధిక వ్యాప్తి..
S రకం మ్యూటేషన్లలో కొత్త వాటిని ఉత్పత్తి చేసే స్పైక్ ప్రోటీన్‌పై జన్యుపరమైన తొడుగు లాంటిది ఉండదు. ప్రస్తుత వేరియంట్ వేగంగా వ్యాపించడానికి తగిన ఆధారాలు లభ్యం కాలేదు. రోగనిరోధకశక్తి అధికంగా ఉంటే తాజా వేరియంట్లను సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉందని, భారత్‌లో ఇప్పటివరకూ B.1.640.2 వేరియంట్ కేసులు రాలేదని స్పష్టంచేశారు. ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ల ప్రభావం, వ్యాప్తి ఢిల్లీ, ముంబైలాంటి మెట్రో నగరాలలో అధికంగా ఉంది. ఇకనుంచి విదేశాల నుంచి వచ్చే వారి వల్ల కాకుండా ఇక్కడే దేశీయంగా కరోనా వ్యాప్తి అధికమవుతుందని ఇన్సాకాగ్ అభిప్రాయపడింది. అంతర్ రాష్ట్రాల ప్రయాణాలతో కరోనా కేసులు మరింత వేగంగా పెరుగుతాయి. ప్రస్తుత వేరియంట్లకు కొవిడ్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఇన్సాకాగ్ మొత్తం 1,50,710 నమూనాలను సేకరించి అందులో 1, 27,697 శాంపిల్స్ విశ్లేషించి రిపోర్టు తయారుచేసింది.
Also Read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు