Long Weekends 2022: జనవరి నుండి డిసెంబర్ వరకు... 2022 పబ్లిక్ హాలీడేస్ ను ఇలా లాంగ్ వీకెండ్ లా మార్చేసుకోండి
ఈ ఏడాది హెచ్ఆర్ ఇచ్చిన పబ్లిక్ హాలీడేస్ ను లాంగ్ వీకెండ్ మార్చుకోవచ్చో తెలుసా. అయితే ఈ కింది జాబితాపై ఓ లుక్కేసేయండి.
కొత్త ఏడాది వచ్చిందంటే దాదాపు అందరు ప్రైవేట్ ఉద్యోగులు చేసే మొదటి పని హెచ్ఆర్ వాళ్లు ఇచ్చిన నోటీసు బోర్డు వద్ద నిలబడి హాలిడే లిస్ట్‌ని చూస్తూ లెక్కలు వేసుకోవడం. ఎందుకంటే మనం ఆలోచించే మొదటి విషయం ఈ సంవత్సరంలో ఎన్ని లాంగ్ వీకెండ్‌లు ఉన్నాయి. లేదా నేను ఎన్ని సెలవులను లాంగ్ వీక్ ఎండ్ మార్చుకోవచ్చు అని. 2022 సంవత్సరంలో లాంగ్ వీకెండ్ లిస్ట్ ఒకటి మేం సిద్ధంచేశాం. అన్ని అనుకున్నట్లు జరిగితే మీరు 19 చిన్న చిన్న ట్రిప్పులు ప్లాన్ చేసుకోవచ్చు.
జనవరి
రిపబ్లిక్ డే - జనవరి 26, ఇది సుదీర్ఘ వారాంతం కానప్పటికీ మీకు సెలవులు ఉంటే వెకేషన్ కు ఓ మంచి అవకాశం.
ఫిబ్రవరి, మార్చి
మహాశివరాత్రి- మార్చి 1, మంగళవారం (సోమవారం, ఫిబ్రవరి 28న టేకాఫ్)
హోలీ - మార్చి 18, శుక్రవారం (మార్చి 19, 20- శని, ఆదివారం)
ఏప్రిల్
మహావీర్ జయంతి/వైశాఖి/ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి - ఏప్రిల్ 14, గురువారం
గుడ్ ఫ్రైడే - ఏప్రిల్ 15 (ఏప్రిల్ 16 , 17 శని, ఆదివారాలు)
మే
ఈద్-ఉల్-ఫితర్ - మే 3, మంగళవారం (మే 1 ఆదివారం, మే 2, సోమవారం రోజు సెలవు పెట్టేస్తే మినీ వీకెండ్ అవుతుంది)
బుద్ధ పూర్ణిమ - మే 16, సోమవారం (మే 14, 15 శని, ఆదివారం)
ఆగస్టు
ముహర్రం - ఆగస్టు 8, సోమవారం (ఆగస్టు 6 - శనివారం రోజు సెలవు పెడితే మినీ వీకెండ్)
రక్షాబంధన్ (రిస్ట్రిక్టెడ్ హాలీడే) - ఆగస్టు 11, గురువారం (శుక్రవారం, ఆగస్టు 12న సెలవు తీసుకుంటే.. ఆగస్టు 13, 14 శని, ఆదివారాలు)
స్వాతంత్ర్య దినోత్సవం - ఆగస్టు 15, సోమవారం
శ్రీ కృష్ణ జన్మాష్టమి - ఆగస్టు 19, శుక్రవారం (ఆగస్టు 20, శనివారం టేకాఫ్; ఆగస్ట్ 21 ఆదివారం)
గణేష్ చతుర్థి - ఆగష్టు 31, బుధవారం (సెప్టెంబర్ 1 గురువారం, అంటే ఒకటిన్నర రోజు లీవ్ పెడితే... సెప్టెంబర్ 2, శుక్రవారం, సెప్టెంబర్ 3, 4 శని, ఆదివారాలు)
ఓనం (రిస్ట్రిక్టెడ్ హాలీడే) - సెప్టెంబర్ 8, గురువారం (సెప్టెంబర్ 9, శుక్రవారం, సెప్టెంబర్ 10, 11 శని, ఆదివారాల్లో సెలవు తీసుకోవచ్చు)
Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో
అక్టోబర్
దసరా - అక్టోబర్ 5, బుధవారం (సుదీర్ఘమైన వీకెండ్ కాదు, కానీ మీరు ఆ బ్యాలెన్స్ లీఫ్‌లలో కొన్నింటిని ఉపయోగించడానికి ఇది మంచి సమయం)
దీపావళి - అక్టోబర్ 24, సోమవారం (అక్టోబర్ 22 ,23 శని, ఆదివారాలు)
నవంబర్
గురునానక్ జయంతి - నవంబర్ 8, మంగళవారం (నవంబర్ 5 & 6 శని & ఆదివారాలు, నవంబర్ 7, సోమవారం సెలవు తీసుకోవచ్చు)
జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ - వీటిలో సుదీర్ఘ వారాంతాలు లేవు. కానీ మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఒక చిన్న ఖాళీని తీసుకోవాలనుకుంటే, పెండింగ్‌లో ఉన్న సెలవులను లెక్కించి వాటిని ఉపయోగించుకోవచ్చు.