By: ABP Desam | Updated at : 22 Jan 2022 09:16 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, శిల్పా శెట్టి, సన్నీ లియోన్, కరణ్ జోహార్ ఇప్పుడు ప్రియాంక చోప్రా... వీరంతా సరోగసీ ద్వారా బిడ్డను కన్నవారే. బాలీవుడ్, హాలీవుడ్‌లలో ఈ ప్రక్రియ బాగా పాపులర్ అయిపోయింది. ఆరోగ్యపరంగా తల్లి కాలేని వాళ్లు, వివిధ సామాజిక కారణాల వల్ల కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు సెలెబ్రిటీలు. ముఖ్యంగా కెరీర్ కు బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేక, గర్భధారణ తరువాత శరీరంలో జరిగే మార్పులకు (బరువు పెరగడం వంటివి) భయపడి కూడా హీరోయిన్లు సరోగసీ బాట పడుతున్నారు. ఈ సరోగసీ పద్ధతి గురించి మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాం.
సరోగసీ పద్దతి అంటే...
ప్రియాంక చోప్రా సరోగసీ పద్ధతిలో తల్లయిన సంగతి తెలిసిందే. వేరే మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకుని తద్వారా సంతానం పొందే విధానమే సరోగసీ. ఇందుకోసం గర్భాన్ని మోసిన తల్లికి పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లిస్తారు. అయితే కొందరిలో మాత్రం బంధువులే ఆ బాధ్యతను తీసుకుని బిడ్డను కని ఇస్తారు.
రెండు రకాలు...
సరోగసీ పద్దతి రెండు రకాలుగా ఉంటుంది.
ట్రెడిషనల్ సరోగసీ: ఈ పద్దతిలో భార్యకు సమస్య ఉన్నప్పుడు భర్త నుంచి వీర్యాన్ని సేకరించి దాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి బిడ్డను పుట్టిస్తారు. ఈ విధానంలో పుట్టే బిడ్డకు సరోగసీ పద్ధతికి ఒప్పుకున్న తల్లికి జన్యు సంబంధం ఉంటుంది. పోలికలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
జెస్టేషనల్ సరోగసీ: ఈ పద్ధతిలో భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యాన్నీ సేకరించి ల్యాబ్ లో ఫలదీకరించి మరో స్త్రీ గర్భంలో ప్రవేశ పెడతారు. ఇలా చేయడం వల్ల గర్భం మోసే తల్లికి, బిడ్డకు ఎటువంటి జన్యు సంబంధం ఉండదు. సరోగసీ మదర్ వివారలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. దాదాపు ఈ విధానంలోనే ఎక్కువ మంది సెలెబ్రిటీలు బిడ్డను కంటారు.
పోషకాహారం చాలా ముఖ్యం
సరోగసీ పద్ధతిలి గర్భాన్ని మోస్తున్న తల్లికి పోషకాహారం తినిపించడం చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే సరోగసీ పద్ధతిలో పుట్టే పిల్లల్లో ప్రోటీన్ లోపం, బరువు తక్కువ పుట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం. అంతేకాదు ఆ తల్లి చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి. గర్భధారణ సమయంలో తల్లి ప్రశాంతంగా లేకపోతే పుట్టే బిడ్డ మొదటి ఏడునెలలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటుందని చాలా అధ్యయనాలు ఇప్పటికే చెప్పాయి.
సరోగసీలోని ఆరోగ్య సమస్యలు
1. సరోగసీ ద్వారా పుట్టే పిల్లలు కొందరు అనారోగ్యంగా పుడుతున్నారు. అలాగే అవయవ లోపాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.
2. ప్రసవసమయంలో తల్లులకు అధికరక్తపోటు, మధుమేహం వంటివి వచ్చి జీవితాంతం వెంటాడుతున్నాయి.
3. సరోగసీ పద్ధతిలో పుట్టే పిల్లలను ప్రసవమైన వెంటనే తల్లిదండ్రులకు అప్పజెప్పేస్తారు. వారికి తల్లిపాలు అందే అవకాశం ఉండదు. దీని వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.
4. అద్దె గర్భం దాల్చిన స్త్రీకి గర్భస్రావం జరిగితే ఆమె ఆరోగ్యం చాలా క్షీణించే అవకాశం ఉంది.
ప్రపంచదేశాలు ఏం చెబుతున్నాయి?
బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలో ఈ సరోగసీ పద్ధతి జోరుమీద సాగుతోంది. అక్కడ దీన్ని పరోపకారంగా అభివర్ణించారు. భారత్ తో పాటూ, ఉక్రెయిన్, కాలిఫోర్నియాలలో కమర్షియల్ సరోగసీని అనుమతించారు. ఇక జర్మనీ, స్వీడన్, సర్వే, ఇటలీలలో దీన్ని నిషేధించారు.
Also read: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు తొమ్మిది చిట్కాలు...
Also read: అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్... ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు
Also read: తిని పడేసే చాక్లెట్ రేపర్‌పై దేవుడి ఫోటో... ఏకిపడేసిన నెటిజన్లు, సారీ చెప్పిన నెస్ట్లే ఇండియా
Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Wall Sit: గోడ కుర్చీ శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష, రోజుకు అయిదు నిమిషాలు వేస్తే ఎన్ని ప్రయోజనాలో
Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది
Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!