అన్వేషించండి

Narmada cruise: జబల్‌పూర్ జల సమాధి - విహారయాత్రలో తీరని విషాదంలో తొమ్మిది మంది బలి - అసలు తప్పెవరిది?

Narmada tragedy: మధ్యప్రదేశ్‌లోని ఆహ్లాదకరమైన విహారయాత్ర కోసం క్రూయిజ్ ఎక్కిన సుమారు 40 మంది పర్యాటకులు, అకస్మాత్తుగా వచ్చిన తుఫాను ధాటికి విలవిల్లాడారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Narmada cruise tragedy: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో పర్యాటకుల విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో పర్యాటకులతో వెళ్తున్న క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా మునిగిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు తోడై ఈ ఘోర ప్రమాదానికి దారితీశాయని జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ వెల్లడించిన ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  
 
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ రిజర్వాయర్‌లో పర్యాటకుల నవ్వులు మృత్యుఘోషగా మారాయి. ఆహ్లాదకరమైన విహారయాత్ర కోసం క్రూయిజ్ ఎక్కిన సుమారు 40 మంది పర్యాటకులు, అకస్మాత్తుగా వచ్చిన తుఫాను ధాటికి జలసమాధి అయ్యారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో, ఒక తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని గట్టిగా హత్తుకుని మరణించిన దృశ్యం చూసి రెస్క్యూ టీమ్ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాణభయంతో అల్లాడుతూ ఆ తల్లి చేసిన చివరి ప్రయత్నం మాతృత్వానికి నిదర్శనంగా మిగిలిపోయింది.

 సెంటర్ ఆఫ్ గ్రావిటీ శాపమై 

ప్రమాదానికి అసలు కారణం బోటు బ్యాలెన్స్ తప్పడమేనని అధికారులు ప్రకటించారు.  గాలి తీవ్రత పెరగడంతో పై అంతస్తులో ఉన్న పర్యాటకులు భయాందోళనతో అటు ఇటు పరుగులు తీశారు. అందరూ ఒకేసారి ఒకవైపుకు చేరడంతో బోటు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోయి ఊగిసలాడటం మొదలైంది. ఈ క్రమంలో కింది భాగంలోకి నీరు చేరడంతో బోటు క్షణాల్లో మునిగిపోయింది. కింది అంతస్తులో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన 28 మంది ప్రాణాలతో బయటపడ్డా, తమ కళ్లముందే ఆత్మీయులు మునిగిపోవడం చూసి కోలుకోలేకపోతున్నారు.

 హెచ్చరికలు ఉన్నా నిర్లక్ష్యం ఎందుకు? 

ఈ ప్రమాదంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి ఒకరోజు ముందే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ, పర్యాటక బోటుకు అనుమతి ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. 2006 నుంచి నడుస్తున్న ఈ సర్వీసులో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బయటపెట్టింది. నిబంధనల ప్రకారం బోటు బలమైన గాలులను తట్టుకుంటుందని భావించినా, ప్రయాణికుల కదలికల వల్ల కలిగే అస్థిరతను అంచనా వేయడంలో సిబ్బంది విఫలమయ్యారు.   

 బాధ్యులపై కఠిన చర్యలు 

ఈ విషాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, హెల్పర్ ,  టికెట్ కౌంటర్ ఇన్‌చార్జ్‌లను విధుల నుంచి తొలగించారు. దీనిపై ఉన్నత స్థాయి శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఒక చిన్నారి ప్రాణంతో సహా తొమ్మిది మందిని బలిగొన్న ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి విచారకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా క్రూయిజ్ ఆపరేషన్ల కోసం కఠినమైన  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల బ్యాలెన్సింగ్,  అత్యవసర రక్షణ చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురానున్నారు. కానీ, పోయిన ప్రాణాలను ఏ నిబంధనలు తిరిగి తీసుకురాలేవు. జబల్‌పూర్ జలాల్లో కలిసిన ఆ చిన్నారి నవ్వులు, ఆ తల్లి త్యాగం వ్యవస్థలోని లోపాలకు నిరంతర హెచ్చరికగా మిగిలిపోతాయి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget