Nagarjuna Sagar Helicopter Crash : తమిళనాడు తరహాలోనే సాగర్‌లో హెలికాఫ్టర్ క్రాష్ !! అందులో ఉన్న దెవరంటే ?
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ కూలిన తరహాలోనే నాగార్జున సాగర్‌లో మరో హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఇద్దరు చనిపోయారు.
![Nagarjuna Sagar Helicopter Crash : తమిళనాడు తరహాలోనే సాగర్‌లో హెలికాఫ్టర్ క్రాష్ !! అందులో ఉన్న దెవరంటే ? Helicopter crashes at Nagarjuna Sagar, two Died Nagarjuna Sagar Helicopter Crash : తమిళనాడు తరహాలోనే సాగర్‌లో హెలికాఫ్టర్ క్రాష్ !! అందులో ఉన్న దెవరంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/5ddb9e2cc499cdf592605a097b19393c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో హెలికాఫ్టర్ కుప్పకూలింది ( Helicopter Crash ) . గాల్లో పెద్ద ఎత్తున పొగల్లో చిక్కుకుని హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి తమిళనాడులో సీడీఎస్ బిపిన్ రావత్ బృందం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలిన దృశ్యాలు గుర్తుకు వచ్చాయి. అదే తరహాలో ఈ హెలికాఫ్టర్ కూడా గాల్లో మంటల్లో చిక్కుకుని పొగలతో కుప్పకూలిపోయింది.
బార్డర్ దాటే ప్రయత్నాలు చేయవద్దు, ఉక్రెయిన్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు
అయితే ఈ హెలికాఫ్టర్ సైన్యానికి సంబంధించినది కాదని తెలుస్తోంది. శిక్షణకు ఉపయోగిచే హెలికాఫ్టర్‌గా ( Training Helicopter ) గుర్తించారు. శిక్షణ ఇస్తున్న పైలట్‌తో ( Pilot ) పాటు శిక్షణ తీసుకుంటున్న మరో ట్రైనీ పైలట్ ( Trainee Pilot ) ఈ హెలికాఫ్టర్‌లో ఉన్నారు. వీరిద్దరూ ప్రమాదంలో చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ హెలికాఫ్టర్ ఫ్లై టెక్ ఏవియేషన్ కంపెనీకి చెందినదని ప్రాథమిక సమాచారం. ఈ కంపెనీ మాచర్ల కేంద్రంగా హెలికాఫ్టర్ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. చనిపోయిన మహిళా ట్రైనీ పైలట్ తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు. ప్రమాదం గురించి గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు ప్రమాద ప్రాంతానికి తరలి వచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీస్, రెవెన్యూ, వైద్య యంత్రాంగాలు వచ్చాయి. తక్షణ చర్యలు తీసుకున్నాయి.
ప్రమాద స్థలంలో దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. హెలికాఫ్టర్ ముక్కలు ముక్కలుగా పొలాల్లో పడిపోయింది. చనిపోయిన పైలట్, ట్రైనీ పైలెట్‌లను గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. పరిస్థితిని చూసి అధికారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. హెలికాఫ్టర్ గాల్లోకి లేచిన తర్వాత ఇంజిన్‌లో సమస్య వచ్చి మంటలు ( Helicopter Fire ) అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. దీన్ని సాంకేతిక నిపుణులు నిర్ధారించాల్సి ఉంది .
తక్కువ ఖర్చుతో ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్, అమ్మాయిగా మారాలనుకున్న యువకుడి కథ విషాదమే !
హెలికాఫ్టర్ కూలిపోయే సమయంలో దగ్గమైన మంటలు.. పొంగలతో ఉందని ప్రత్యక్ష సాక్షులైన రైతులు చెబుతున్నారు. ఆ శిక్షణ హెలికాఫ్టర్ ఏ సంస్థది.. ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్‌కు జరిగిన తరహా ప్రమాదం కావడంతో అసలేం జరిగిందో ఆరా తీస్తున్నారు. మంటల్లో చిక్కుకుని హెలికాఫ్టర్ పొలాల్లో శకలాలుగా పడటంతో గ్రామస్తులు భయాందోళలకు గురయ్యారు.పెద్ద ఎత్తున శకలాల వద్దకు చేరుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)