By: ABP Desam | Updated at : 26 Feb 2022 12:52 PM (IST)
ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోతున్న పౌరులు (PTI Photo/Kamal Singh)
Ukraine Russia Conflict: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు అధికారులు పలు సూచనలు చేశారు. అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని కీవ్‌లోని రాయబార కార్యాలయం సూచించింది. సరిహద్దుల వద్ద పరిస్థితి అంతగా బాగోలేదని, భారతీయులు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారని చెప్పారు. ఎంబసీలతో కలిపి పనిచేస్తూ పౌరులను వారి దేశాల (Indians In Ukraine)కు పంపే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.
బార్డర్ దాటే ప్రయత్నాలు చేయవద్దు..
భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు కీవ్‌లోని రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. కీవ్ నగరంలో ఉన్న పౌరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అధికారుల సమాచారం లేకపోతే ఎక్కడికి వెళ్లకూడదు (Indians In Ukraine Not To Move Without Official Statements), ముఖ్యంగా సరిహద్దులు దాటే ప్రయత్నం చేయకూడదని ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దుల వద్ద పరిస్థితి అంత ఈజీగా లేదు. ఉక్రెయిన్ నుంచి దేశానికి పౌరులను రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
అక్కడి వాళ్లు కొంతవరకు సేఫ్
అధికారిక సమాచారం లేకుండా మీరు సరిహద్దులు దాటితే చిక్కుల్లో ఇరుక్కుంటారు. పశ్చిమ ఉక్రెయిన్ లో ఉన్న వారికి ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంది. తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న వారు ఇళ్లు వదిలి బయటకు రాకూడదు. వీలున్న చోట తలదాచుకుంటే మంచిది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్న వారిని ఎంబసీ అలర్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకోవాలనుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు సీఎంలు, మంత్రులను కేంద్రానికి సమాచారం అందించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్ ఉంటున్న తమ వారి వివరాలను హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి చెప్పాలని అధికారులు సూచించారు. మరోవైపు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో చర్చలకు అంగీకరించారు. తాము చెప్పినట్లుగా ఆయుధాలు స్వాధీనం చేయాలని, రష్యా షరతులకు అంగీకరించాలని కొన్ని కండీషన్లు పెట్టారు. చర్చలతో పరిస్థితి సాధారణ స్థితికి రావాలని అంతా కోరుకుంటున్నారు.
ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇతర దేశాల్లాగే తాము సైతం భారత పౌరుల క్షేమం, రక్షణ గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు పౌరులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: Russia Ukraine War: కనికరించిన పుతిన్- ఉక్రెయిన్‌తో చర్చలకు ఓకే, కానీ అలా చేస్తేనే!
Karimnagar: అగ్గిపుల్ల తల సైజులో ఎలుకల ట్రాప్, పని చేసేలా అరగంటలోనే తయారీ- సూదిపై నర్సు, గణపతి!
Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!
Drone Shot Down: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి యత్నం, బాంబులతో వచ్చిన డ్రోన్ కథువాలో కూల్చివేత
Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి
Breaking News Live Updates: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్
Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!