Nellore: తక్కువ ఖర్చుతో ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్, అమ్మాయిగా మారాలనుకున్న యువకుడి కథ విషాదమే !
మిడి మిడి జ్ఞానం ఓ ప్రాణాన్ని తీసింది. డాక్టర్ వద్ద పనిచేస్తూ ఆపరేషన్లు చేయడంలో సాయం చేసే ఓ బీఫార్మసీ విద్యార్థి.. నేరుగా తానే ఆపరేషన్ చేయడానికి పూనుకోవడంతో ఓ ప్రాణం పోయింది.
మిడి మిడి జ్ఞానం ఓ ప్రాణాన్ని తీసింది. డాక్టర్ వద్ద పనిచేస్తూ ఆపరేషన్లు చేయడంలో సాయం చేసే ఓ బీఫార్మసీ విద్యార్థి.. నేరుగా తానే ఆపరేషన్ చేయడానికి పూనుకోవడంతో ఓ ప్రాణం పోయింది. ట్రాన్స్ జెండర్ గా మారాలనుకున్న ఓ యువకుడు చివరకు విగతజీవిగా మారాడు. నెల్లూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిన్నతనం నుంచి ఆడవారి లక్షణాలు..
ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్ అనే యువకుడు చిన్నతనం నుంచి ఆడవారి లక్షణాలతో ఉండేవాడు. కానీ తల్లిదండ్రులకి చెప్పుకోలేక మథనపడేవాడు. హైదరాబాద్ లో ఉపాధికోసం వెళ్లిన అతనికి మేనమామ కుమార్తెతో పెద్దలు పెళ్లి చేశారు. కానీ కాపురం చేయలేక అతను విడాకులు తీసుకున్నాడు. అమూల్యగా పేరు మార్చుకుని హిజ్రాలతో కలసి తిరిగేవాడు. కొంతకాలంగా ఒంగోలులో ఉంటున్న శ్రీకాంత్ అలియాస్ అమూల్యకు విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్ జెండర్ మోనాలిసాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా మారి నెల్లూరు సహా ఇతర ప్రాంతాలకు వస్తూ పోతూ ఉండేవారు. వీరిద్దరికీ నెల్లూరుకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థులతో పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా వీరికి పరిచయం మొదలవగా.. నేరుగా అమూల్య నెల్లూరుకి రావడంతో మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో స్నేహితులైన బీ ఫార్మసీ విద్యార్థులు మస్తాన్, జీవాతో అన్ని విషయాలు చెప్పేది అమూల్య. ముంబై వెళ్లి ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా మహిళగా మారిపోతానని చెప్పింది. అయితే ఆ ఆపరేషన్ కు లక్షలు ఖర్చవుతాయి. అంత డబ్బు లేకపోవడంతో వేచి చూస్తున్నట్టు చెప్పింది.
తక్కువ ఖర్చులో ఆపరేషన్..
నెల్లూరు నగరంలోని ఓ డాక్టర్ వద్ద మస్తాన్ సహాయకుడిగా పనిచేసేవాడని తెలుస్తోంది. ఆపరేషన్లు చేసే సమయంలో ఆ డాక్టర్ కి సహాయకుడిగా ఉండే మస్తాన్.. తనకు కూడా ఆపరేషన్లు చేయడం వచ్చేసిందని అనుకునేవాడు. తొలి ప్రయోగం అమూల్యపై చేయాలనుకున్నాడు. తక్కువ ఖర్చులోనే ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేస్తానని నమ్మించి, ఓ లాడ్జీలో రూమ్ తీసుకుని ప్రయోగం మొదలు పెట్టాడు.
ఈనెల 23న నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లోని ఓ ప్రైవేటు లాడ్జీలో ఆపరేషన్ మొదలు పెట్టారు. అనస్తీషియా ఇచ్చి మర్మాంగం పూర్తిగా తొలగించారు. అయితే రక్తస్రావం తీవ్రం కావడంతో భయపడ్డారు. అనస్తీషియా మోతాదు ఎక్కువ కావడంతో అమూల్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కాసేపటికే శ్రీకాంత్ అలియాస్ అమూల్య మృతి చెందింది. దీంతో వారంతా మస్తాన్, జీవా, మోనాలిసా.. అక్కడినుంచి పారిపోయారు. లాడ్జి వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అమూల్య దగ్గర లభ్యమైన ఆధారాలతో సోదరి పల్లవికి సమాచారం ఇచ్చారు. పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులకోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Also Read: Weather Updates: బీ అలర్ట్, ఒక్కసారిగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, రాత్రివేళ అక్కడ గజగజ
Also Read: Gold Price Today: గుడ్‌న్యూస్, నేడు బంగారం ధరలు పతనం, రూ.2,700 మేర క్షీణించిన వెండి ధర