అన్వేషించండి

Gold Price Today: గుడ్‌న్యూస్, నేడు బంగారం ధరలు పతనం, రూ.2,700 మేర క్షీణించిన వెండి ధర

Gold Price Today 26th February 2022: ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నందున నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు పతనమైంది.

Gold Price Today In Hyderabad: గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నందున నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ.400 మేర క్షీణించింది. వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర (Gold Rates Today In Hyderabad) రూ.440 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.51,110 అయింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.2,700 మేర భారీగా దిగొచ్చింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.70,000 కు పతనమైంది.

ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. విజయవాడలో రూ.400 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 26th February 2022) తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850కి పతనమైంది. విజయవాడలో వెండిపై రూ.2,500 మేర దిగిరాగా, 1 కేజీ ధర రూ.70,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ఇదే ధరలో ట్రేడింగ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,840 అయింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నిలకడగా ఉంది.  ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ((Gold Rates Today In Delhi)) 10 గ్రాముల ధర రూ.51,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,260 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 అయింది.

ప్లాటినం ధర
బంగారంతో పాటు మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో రూ.128 మేర తగ్గడంతో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,740 కి దిగొచ్చింది. చెన్నైలో రూ.112 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.27,020కి ఎగబాకింది. ముంబై, ఢిల్లీలలో రూ.128 తగ్గడంతో ప్లాటినం ధర రూ.25,740 అయింది. 

పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget