(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: బీ అలర్ట్, ఒక్కసారిగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, రాత్రివేళ అక్కడ గజగజ
AP Weather Updates: కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 25 డిగ్రీల మేర నమోదు కావడం వాతావరణంలో మార్పులను తెలుపుతుంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగితే, మరికొన్ని చోట్ల తగ్గాయి
Andhra Pradesh And Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి దాదాపుగా తగ్గింది. పొడి గాలులు వీచడంతో తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 25 డిగ్రీల మేర నమోదు కావడం వాతావరణంలో మార్పులను తెలుపుతుంది. ఏపీలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. రైతులు ధాన్యాన్ని బయట ఆరబెట్టుకోవచ్చునని చెప్పారు. మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో 18 డిగ్రీలు, నందిగామలో 18.7 డిగ్రీలు, కళింగపట్నంలో 18.5 డిగ్రీలు, అమరావతిలో 19.2 డిగ్రీలు, విశాఖపట్నంలో 21.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రత..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలు చేరే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో పొడి గాలులు పెరగడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత తప్పదు. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నా, మధ్యాహ్నాలు మాత్రం వేడిగా ఉంటుంది. ఆరోగ్యవరంలో రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదైంది. అనంతపురంలో 17.4 డిగ్రీలు, నంద్యాలలో 17.6 డిగ్రీలు, తిరుపతిలో 18.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Daily weather report for Andhra Pradesh Dated 25.02.2022. pic.twitter.com/SFJ7JQc7if
— MC Amaravati (@AmaravatiMc) February 25, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపుగా 20 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌లో 19 డిగ్రీలు, భద్రాచలంలో 21 డిగ్రీలు, హకీంపేటలో 17.4 డిగ్రీలు, హన్మకొండలో 19.5 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 19.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 21.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నిజామాబాద్‌లో నమోదు చేసినట్లు వాతావరణశాఖ పేర్కొంది.
Also Read: Karimnagar Smart City: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు ముందుకు సాగేనా? బడ్జెట్ పెరుగుతున్నా లెక్కలు తప్పారా !