అన్వేషించండి

Top Headlines Today: భారీ వర్షాలతో 432 రైళ్లు రద్దు, వరద బాధితులకు నిధులు విడుదల చేసిన రేవంత్ - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh Rains News | ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలకు అవాంతరాలు తలెత్తాయి. బ్రిడ్జి కింద మట్టి, కంకర కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు రద్దు చేశారు.

'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం ఆయన విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని.. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

విపత్తు వేళ అమానవీయం - వరదల్లో బోట్ల యజమానుల దందా, తరలించేందుకు అధిక డబ్బులు వసూలు!
ఏపీలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. విజయవాడ (Vijayawada) పూర్తిగా నీట మునిగింది. ఇళ్లు నీట మునిగిపోగా బాధితులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. బోట్ల ద్వారా బాధితులకు ఆహారం అందించడం సహా పూర్తిగా నీరు ఉన్న చోట బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా కొందరు ప్రైవేట్ బోటు యజమానులు అమానవీయంగా ప్రవరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

వరద బాధితల కోసం నిధులు విడుదల చేసిన రేవంత్- సాయం ఐదు లక్షలకు పెంపు
తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు, రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా పల్లెల్లు నీటిలో కాపురాలు చేస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ వర్షాలకు ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - 432 రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఆదివారం నుంచి ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వే 432 రైళ్లు రద్దు చేయగా.. 140 రైళ్లను దారి మళ్లించింది. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో పలు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. అటు, తెలంగాణలో వర్షాలు, వరద ఉద్ధృతితో పలుచోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

బెజవాడ దుఃఖదాయని బుడమేరు వరదలకు కారణమేంటీ? మానవ తప్పిదమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా?
మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వయనాడ్ బీభత్సం తెలియజేస్తే లేటెస్ట్‌గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రశాయి. ముఖ్యంగా విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే బుడమేరు అనే చిన్న నది (నిజానికి నది అని పిలిచినా ఇది ఒక పెద్ద సైజు కాలువ అని చెప్పుకోవచ్చు) ఈరోజు నాలుగు జిల్లాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. విజయవాడ సిటీ అయితే రెండు రోజులుగా నిద్ర పోవడం లేదు. సగానికిపైనే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget