CM Chandrababu: 'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
AP Rains: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం మరోసారి అధికారులతో సమీక్షించారు. విజయవాడ సింగ్ నగర్‌లో జోరు వర్షంలోనూ మరోసారి బోటులో ఆయన పర్యటించారు.
CM Chandrababu Visited Flood Effected Areas In Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం ఆయన విజయవాడ (Vijayawada) కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని.. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని సూచించారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయని.. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలని అన్నారు. బాధితులకు సమీపంలోని కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధం చేయాలని చెప్పారు. వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడకుండా హోటళ్లలో ఉంచాలని అన్నారు.
విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్
విజయవాడలో ఆదివారం సాయంత్రం బోట్లలో పర్యటించిన సీఎం అప్పటినుంచి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలిస్తూనే ఉన్నారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పవర్ బోట్స్ పంపాలని కోరగా.. సోమవారం ఉదయానికి అవి విజయవాడ చేరుకున్నాయి. ఈ బోట్స్ ద్వారా పూర్తిగా నీట మునిగిన సింగ్ నగర్ ప్రాంతంలో ఆహారం పంపిణీ చేపట్టారు. పెద్దఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.
జోరువానలోనూ సీఎం పర్యటన
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకూ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి నిర్విరామంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు ఆహారం, తాగునీరు అందుతున్నాయా లేదా.? అనేది ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం వారికి ధైర్యం చెప్పారు. సోమవారం ఉదయం జోరు వానలోనూ సింగ్ నగర్‌లో మరోసారి ఆయన పర్యటించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా లేదా అనేది ఆరా తీశారు. తనతో సహా అధికారులంతా బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.
Andhra Pradesh CM N Chandrababu Naidu says "We are streamlining the system. 110 boats are currently working to supply food and provide medical assistance. I am regularly monitoring the flood situation and officials are actively working on the ground. Since last night, I have… https://t.co/Ws7RaarO2f pic.twitter.com/ly3DKsZ1yH
— ANI (@ANI) September 2, 2024
#WATCH | Andra Pradesh CM N Chandrababu Naidu meets flood-affected people in Vijayawada. pic.twitter.com/nBMLl4jlkd
— ANI (@ANI) September 2, 2024
'వరద బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలి. హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలి. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలి. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలి. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అందరికీ సాయం అందుతుంది.' అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Also Read: Vijayawada Flood: బెజవాడ దుఃఖదాయని బుడమేరు వరదలకు కారణమేంటీ? మానవ తప్పిదమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా?