అన్వేషించండి

Galgotias University: చైనా రోబోను కొనుక్కొచ్చి సొంత ఆవిష్కరణగా ప్రచారం - ఏఐ ఎక్స్‌పోలో పరువు తీసిన యూనివర్శిటీ - గెంటేసిన ప్రభుత్వం

India AI Expo: గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్ ను ఏఐ ఎక్స్‌పో నుంచి ఖాళీ చేయించారు. ఓ చైనా రోబోను తమ ఆవిష్కరణ అని ప్రచారం చేసుకోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Chinese robot debacle India AI Expo: న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక  ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబో తీవ్ర దుమారం రేపింది. యూనివర్సిటీ తన సొంత ఆవిష్కరణగా పేర్కొన్న  ఓరియన్ అనే రోబోటిక్ డాగ్, అసలు చైనాకు చెందిన  యూనిట్రీ గో2 అని తేలడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వివాదం దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో, ఎక్స్‌పో నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం గల్గోటియాస్ యూనివర్సిటీని ఆదేశించింది.

ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోతో మొదలైంది. గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్  తమ యూనివర్సిటీకి చెందిన  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  ఈ రోబోను అభివృద్ధి చేసిందని, ఇందుకోసం సుమారు రూ. 350 కోట్లు వెచ్చించామని  గొప్పగా మీడియా ఇంటర్యూల్లో చెప్పారు.  అయితే, నెటిజన్లు ఆ రోబోపై ఉన్న బ్రాండింగ్‌ను గమనించి, అది ఆన్‌లైన్‌లో కేవలం రూ. 2-3 లక్షలకు లభించే చైనా కంపెనీ ఉత్పత్తి అని ఆధారాలతో సహా బయటపెట్టారు.         

దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందించాయి. భారతీయ ప్రతిభను చాటాల్సిన వేదికపై చైనా ఉత్పత్తులను సొంత ఆవిష్కరణలుగా ఎలా ప్రదర్శిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది భారత్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. చైనా మీడియా కూడా ఈ ఘటనను ఉటంకిస్తూ భారత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో కేంద్ర ఐటీ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.   

వివాదం ముదరడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ వివరణ ఇస్తూ.. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, విద్యార్థుల పరిశోధనల కోసం దానిని కొనుగోలు చేశామని పేర్కొంది. ప్రొఫెసర్ మాటల్లో స్పష్టత లేకపోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే, ఎక్స్ లో వీరి వివరణకు కమ్యూనిటీ నోట్ తోడైంది, యూనివర్సిటీ గతంలో చేసిన క్లెయిమ్స్ అబద్ధమని అది స్పష్టం చేసింది.         

చివరికి, ప్రభుత్వం ఆదేశాలతో గల్గోటియాస్ స్టాల్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసి, వారిని ఎక్స్‌పో ప్రాంగణం నుండి పంపివేసినట్లు సమాచారం. దేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన ఇలాంటి వేదికలపై విదేశీ పరికరాలను రీ-బ్రాండింగ్ చేసి ప్రదర్శించడంపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.    

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget