Nara Lokesh on Fire: ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్ ?
Andhra pradesh news | భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్, ఫ్లైట్ ఛార్జీలు తనవేనంటూ తనపై వచ్చిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమరావతి: సీఎంలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, కొన్ని వ్యక్తిగత ఈవెంట్లు, పనులకు సైతం వెళ్తుంటారు. ఆ సమయలో వారు చేసే ప్రయాణాల ఖర్చులపై వివాదం నడుస్తుంది. ప్రజాధనం వృథా చేస్తున్నారని, అప్పనంగా ప్రజల సొమ్ము వాడేస్తున్నారని.. అవసరం లేకున్నా విమానాల్లో, హెలికాప్టర్లో పర్యటనలకు వెళ్లి డబ్బులు తగలేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనలో మంత్రి నారా లోకేష్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు నారా లోకేష్ పుష్ప సినిమా స్టైల్లో డైలాగ్ ను గుర్తుచేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Colombo is buzzing tonight! 🔥
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
And I’m cheering for Team India as the giants clash - India vs Pakistan!l There’s nothing like the thrill of cricket uniting millions with one heartbeat.
Let’s go boys - make the nation proud!#INDvsPAK pic.twitter.com/xVRkfFMK4U
శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ప్రజాధనం వృథా చేశాడని వైసీపీ విమర్శలు చేసింది. వారి అనుకూల మీడియాలోనూ దీనిపై కథనం ప్రసారం చేసింది. కొలంబోలో జరిగిన భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ కి ప్రజల సొమ్ముతో విమాన టికెట్లు, మ్యాచ్ టికెట్లు కొని జల్సాలు చేశారని లోకేష్ పై విమర్శలు గుప్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్త లో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. మంత్రి లోకేష్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దు అని సోషల్ మీడియా ఖాతాల్లో స్పష్టం చేసింది.
What a night for Team India in #Colombo! Brilliant knock by Ishan Kishan - fearless, fluent, fantastic! And hats off to our bowlers who hunted in a pack and sealed a thumping victory with pure dominance! Proud of Team #India!#INDvsPAK #T20WorldCup2026 pic.twitter.com/iNBAZT5ib8
— Lokesh Nara (@naralokesh) February 15, 2026
పుష్ప స్టైల్లో మంత్రి లోకేష్ కౌంటర్..
భారత్, పాక్ మ్యాచ్ చూసేందుకు తాను ప్రజా ధనాన్ని వృథా చేసి ఎంజాయ్ చేశానన్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి పైసా తనవేనని, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టు కూడా నాదే.. నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్ అని కౌంటర్ ఇవ్వగా వైరల్ అవుతోంది.
ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా @ysjagan?#PsychoFekuJagan https://t.co/0NoaEvQMe6
— Lokesh Nara (@naralokesh) February 18, 2026
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రజాధనంతో విమానాల్లో షికార్లు చేస్తుంటారని, ప్రజల డబ్బును సొంత పనులను వాడుకుంటారని వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తుంటారు. అయితే ప్రజా ధనం ఎక్కడా వృథా చేయలేదని గతంలో పలుమార్లు ఆరోపణలు, విమర్శలకు కూటమి నేతలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా తనపై విమర్శలు రావడంతో లోకేష్ అందులో నిజం లేదన్నారు.
























