అన్వేషించండి

Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?

Nitai Roy Chowdhury: బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సారధ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.ఓ హిందువు కేబినెట్‌లో చోటు కల్పించారు.

Bangladesh Hindu leader Nitai Roy Chowdhury As Minister:  బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, బిఎన్‌పి ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్  దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుమారు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తారిఖ్ రెహమాన్, గత రెండు దశాబ్దాల తర్వాత తన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఏర్పడిన నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించింది.
 
కొత్త ప్రభుత్వ కేబినెట్‌లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితాయ్ రాయ్ చౌదరికి కీలక స్థానం లభించింది. ఆయన సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1949లో జన్మించిన నితాయ్ రాయ్ చౌదరి వృత్తిరీత్యా న్యాయవాది ,  బిఎన్‌పి వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ ప్రభుత్వంలో విద్య, యువజన , క్రీడలు,   న్యాయ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు బౌద్ధ మతానికి చెందిన దీపెన్ దివాన్ చక్మాను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా మైనారిటీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలనే సంకేతాన్ని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం ఇచ్చింది. 

మొత్తం 50 మంది సభ్యులతో కూడిన ఈ భారీ మంత్రివర్గంలో 25 మంది క్యాబినెట్ మంత్రులు, 24 మంది రాష్ట్ర మంత్రులు ,  ముగ్గురు టెక్నోక్రాట్లు ఉన్నారు. మిర్జా ఫకృల్ ఇస్లాం ఆలంగీర్, అమీర్ ఖస్రూ మహ్మద్ చౌదరి వంటి సీనియర్ నేతలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంతో భారత్ సానుకూల సంబంధాలను కొనసాగించాలనుకుంటోందనడానికి ఇది ఒక నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.     


ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో బిఎన్‌పి కూటమి 300 స్థానాలకు గాను 212 స్థానాల్లో  విజయం సాధించి ఘనవిజయాన్ని నమోదు చేసింది. జమాత్-ఏ-ఇస్లామీ 68 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. ప్రజల ఐక్యత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ , ఆర్థిక సంస్కరణలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని తారిఖ్ రెహమాన్ తన తొలి ప్రసంగంలో ప్రకటించారు.                                           

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget