ABP Southern Rising Summit 2024: దక్షిణాది క్రీడా ప్రస్థానం ఎలా ఉండబోతోంది ? పుల్లెల గోపీచంద్ అంచనాలేమిటి ?
Pullela Gopichand: పుల్లెల గోపీచంద్. తెలుగువారికే కాదు దేశానికి క్రీడా రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన దక్షిణాది క్రీడా వెలుగులు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు ?
ABP Southern Rising Summit : అభివృద్ది అంటే ఒక్క రంగంలో అడుగు ముందుకు వేయడం కాదు. ఆర్థికంగా మెరుగుపడటం మాత్రమే అభివృద్ధి కాదు. సమాజంలో సంస్కృతిక, క్రీడా రంగాల్లోనే ప్రమాణాలు మెరుగుపడితేనే అది అభివృద్ధి. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు తమ తమ దేశాల్లో క్రీడలకూ ప్రాధాన్యం ఇస్తూంటాయి. భారత్ లో వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎక్కువ మందిలో అసంతృప్తి ఉంది. అయితే దేశ క్రీడా రంగం నుంచి ఎన్నో ఆణిముత్యాలు ప్రపంచంలో తమదైన ముద్ర వేశాయి. అలాంటి వార చాలా మంది భావిపౌరుల్లో ప్రతిభను వెలికి తీయడానికి తమ జీవితాన్ని వెచ్చిస్తున్నారు. వారిలో ఒకరు మాజీ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ సింగిల్స్ చాంపియన్ పుల్లెల గోపీచంద్.
Get ready to hear from Indian National Badminton Coach @PGopichand73 at The Southern Rising Summit 2024 Join us on October 25 Watch live on https://t.co/U5l1bBn40h https://t.co/yN3o2Q0uhp https://t.co/EqJx7iI6ZL @Abpdesam @Abplive#GoAheadGoSouth #TheSouthernrisingsummit2024 pic.twitter.com/fI6rpJIRXe
— ABP Desam (@ABPDesam) October 22, 2024
పుల్లెల గోపీచంద్ తన అకాడెమీ ద్వారా చురుకైన బ్యాడ్మింటన్ క్రీడాకారుల్ని మన దేశానికి అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. సింధు లాంటి ప్లేయర్లు గోపీచంద్ అకాడెమీ నుంచి వచ్చిన వారే. ఇప్పటికి తన పూర్తి జీవితం కోచింగ్ పైనే పెట్టారు గోపీచంద్. ఆయన క్రీడారంగంలో భారత ఉజ్వల భవిష్యత్ ను స్వప్నిస్తున్నారు. రాను రాను మెరుగుపడుతున్న క్రీడాప్రమాణాలు భవిష్యత్ లో భారత్ తిరుగులేని క్రీడాకారుల నిలయంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే మరి ప్రభుత్వాలు ఆ దిశగా సాగడానికి ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నాయన్నది సస్పెన్స్. ఈ విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి ఉంటుంది. కానీ మన దేశంలో ప్రభుత్వాల ప్రయారిటీ ప్రధానంగా ప్రజల కనీస అవసరాలు తీర్చడం. ఆ తర్వాతే ఆటపాటలపై దృష్టి. ఓటు బ్యాంక్ రాజకీయాలు పెరిగిపోయిన తర్వాత అవసరం లేకపోయినా ప్రజలకు వరాలిస్తూ ఇతర అంశాలవైపు రావడం లేదు. అందుకే క్రీడారంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. అనేక మంది క్రీడాకారుల ఆందోళన ఇదే.
అయితే పరిస్థితి మెరుగుపడటానికి ఏం చేయాలన్నదానిపై మాజీ క్రీడాకారులు ప్రభుత్వాలకు అనేక సలహాలిస్తారు. గోపీచంద్ లాంటి కోచ్‌లు.. తన చేతల ద్వారా ప్రభుత్వాలు ఏం చేస్తే మెరుగైన క్రీడాకారులు దేశం నుంచి వస్తారో తెలియచేస్తారు. దక్షిణాది క్రీడా ప్రమాణాలను విశ్లేషించేందుకు తన అభిప్రాయాలను, ఆలోచలను.. వివరించేందుకు ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు.
📸The Southern Rising Summit 2024 is here📸
— ABP Desam (@ABPDesam) October 23, 2024
Join us on October 25
🎥Tune in live on https://t.co/U5l1bBn40h https://t.co/yN3o2Q0uhp https://t.co/EqJx7iI6ZL@abpdesam @abplive #GoAheadGoSouth #TheSouthernRisingSummit2024 #ABPSouthernRisingSummit2024 #ABPDesam pic.twitter.com/yWY1p4rsi1