అన్వేషించండి

Epstein Files: ఇండియాలోనూ ఎప్ స్టీన్ ఫైల్స్ కలకలం - మోదీ, హర్దీప్‌పై రాహుల్ ఆరోపణలు- బీజేపీ ఆగ్రహం!

Hardeep Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ, హర్దీప్ పేర్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Epstein Files Hardeep Puri Refutes Rahul Gandhi Charge: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్ స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాల  వివాదం భారత రాజకీయాలనూ కలకలం రేపుతోంది. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్ స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆ పత్రాలలో మోదీ పేరు ఉందంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కూడా ఎప్ స్టీన్‌తో పరిచయాలు ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు.  
  
రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. 2010లో తాను ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా పనిచేస్తున్నప్పుడు ఒక సామాజిక కార్యక్రమంలో ఎప్ స్టీన్‌ను కలిశానని తెలిపారు.  ఆ పరిచయం కేవలం వృత్తిపరమైనది, యాదృచ్ఛికమైనది మాత్రమేనని స్పష్టం చేశారు.  బయటపడిన లక్షల ఫైల్స్ లో తన ప్రస్తావన కేవలం నాలుగు లైన్లలో మాత్రమే ఉందన్నారు.  రాహుల్ గాంధీ ఒక అబద్ధాల కోరు అని, తన కుటుంబ సభ్యులు ,కాంగ్రెస్ నాయకులకు అంతర్జాతీయంగా ఉన్న అనుమానాస్పద సంబంధాలను దాచుకోవడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పూరి విమర్శించారు.   

 
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ రాహుల్ గాంధీకి  గడువు విధించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను 24 గంటలలోపు దేశం ముందు ఉంచాలని, లేనిపక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన విపక్ష నేత హోదాలో ఉండి, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రధాని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని రిజిజు హెచ్చరించారు. అబద్ధపు ప్రచారాలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. 

ఈ వివాదం పార్లమెంటు మరియు వెలుపల కూడా వేడిని పెంచింది.  బీజేపీ  నేతలు రాహుల్ గాంధీపై  సభా హక్కుల ఉల్లంఘన నోటీసు  ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ఉన్న సమాచారం బహిర్గతం కావాలని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని పట్టుబడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయికి చెందిన ఈ వివాదం భారత రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది.     

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Breaking News: విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Nara Lokesh: మంగళగిరిలో 3 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్
మంగళగిరిలో 3 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget