News
News
X

Elon Musk puja: అందరికీ ఫ్యాన్స్ ఉంటే మస్క్‌కు మాత్రం భక్తులుంటారు, ప్రూఫ్ కావాలా? ఈ వీడియో చూడండి

Elon Musk puja: బెంగళూరులోని ఓ సంస్థ ఎలన్ మస్క్‌కు పూజలు చేసింది.

FOLLOW US: 
Share:

Elon Musk Puja:

మస్క్‌కు పూజలు..

ప్రపంచవ్యాప్తంగా రోజూ ఏదో విధంగా వినిపించే పేరు టెస్లా, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్. ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన వార్తల్లో ఉంటూనే ఉన్నారు. పాలసీల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే..మస్క్‌ను తిట్టే వాళ్లెంత మంది ఉన్నారో పొగిడే వాళ్లూ అంతే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ చేసిన పనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బెంగళూరులో ఎలన్‌ మస్క్‌కు ఫోటో పెట్టి పూజలు చేశారు ఆ అభిమానులు. హారతి ఇచ్చి, అగరొత్తులు వెలిగించి భజన చేశారు. ఫిబ్రవరి 26న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో  Save Indian Family Foundation ఆధ్వర్యంలో జరిగిందీ పూజా కార్యక్రమం. ఓ వ్యక్తి హారతి ఇచ్చి మస్క్ పేరిట భజన చేస్తుండగా..మరో వ్యక్తి అగరొత్తులు వెలిగించి మస్క్ ఫోటో ముందు పెట్టాడు. ఓం మస్కాయ నమః, ఓం ట్విటరాయ నమః అంటూ మంత్రాలు కూడా చదివారు. ఇంతకీ వాళ్లకు మస్క్‌పై ఇంత భక్తి ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా..? ట్విటర్‌లో సెన్సార్‌షిప్‌ను తగ్గించినందుకట. మగవాళ్లందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వీలు కల్పించారంటూ మస్క్‌కు ఇలా థాంక్స్ చెప్పారు. మస్క్ రాకముందు ట్విటర్‌లో మగవాళ్ల హక్కులను తొక్కేశారని, ఆయన వచ్చాకే తమకు ఫ్రీడమ్ వచ్చిందని చెబుతున్నారు. ఈ పూజకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో షేర్ చేసింది సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్.  

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇందే పూజరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయినా...బతికున్న వాడి ఫోటో పెట్టి పూజలు చేస్తున్నారేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళలకు వ్యతిరేకంగా చేసిన పూజలివి అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఇంకొందరు మీమ్స్‌తో ఆటాడేసుకుంటున్నారు. 

Also Read: Bihar Quadrangle Love : బీహార్ లో విచిత్ర ప్రేమకథ- భర్తల ఎక్స్ఛేంజ్ ఆపై వివాహం!

Published at : 03 Mar 2023 11:13 AM (IST) Tags: Bengaluru Elon Musk TWITTER Elon Musk Puja Save Indian Family Foundation

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Breaking News Live Telugu Updates: కారుపై పెట్రోల్ పోసి నిప్పు, లోపల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సజీవ దహనం

Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్

Warangal CP AV Ranganath : పాలాభిషేకాలు చేయొద్దు, నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అంతే - సీపీ రంగనాథ్

Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?

Karnataka Elections 2023: మోదీ చరిష్మానే నమ్ముకున్న కర్ణాటక బీజేపీ, మేజిక్ వర్కౌట్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం