Bihar Quadrangle Love : బీహార్ లో విచిత్ర ప్రేమకథ- భర్తల ఎక్స్ఛేంజ్ ఆపై వివాహం!
Bihar Quadrangle Love : బీహార్‌లో విచిత్రమైన సంఘటనలో భార్యల మార్పిడి జరిగింది. ఇద్దరు వివాహితలు ఒకరి భర్తను మరొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Bihar Quadrangle Love : బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడప్పుడు సినిమాల్లో చూపించినట్లు ఒకరి భర్తను మరొకరు ప్రేమించారు. అక్కడితో ఆగకుండా భర్తలను ఎక్స్ఛేంజ్ కూడా చేసుకున్నారు. అంటే ఒకరి భర్తను మరొకరు పెళ్లి చేసుకున్నారు. దీనినే కొందరు నెటిజన్లు భర్తల మార్పిడి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బీహార్ లో రెండు విచిత్రమైన ప్రేమకథలు చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు వివాహితలు ఒకరి భర్తను మరొకరు వివాహం చేసుకున్నారు. బీహార్‌లోని ఖగారియా జిల్లా ఈ వింత ప్రేమకథలకు కేంద్రం అయింది. ఎన్నో మలుపులు తిరిగిన ఈ ప్రేమకథలకు చివరికి పెళ్లితో ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ విచిత్ర సంఘటనను చూసి స్థానికులు అవాక్కయ్యారు.
అసలేం జరిగింది?
ఇక్కడ మరో విచిత్రం కూడా ఉందండోయ్. ఇద్దరు మహిళల పేర్లు కూడా ఒక్కటే... అదే రూబీ దేవి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, చౌతం పోలీస్ స్టేషన్ పరిధిలోని పస్రాహా గ్రామానికి చెందిన రూబీ దేవి 2009లో నీరజ్ కుమార్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు అదే గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ముఖేష్ కూడా వివాహం చేసుకున్నాడు. అతడి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య పేరు కూడా రూబీ దేవి. అయితే ప్రేమించుకున్న ముఖేష్, రూబీ దేవి గతేడాది ఫిబ్రవరి 6న ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. ఇలా వెళ్లిపోయిన రూబీ తనతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను తీసుకుని వెళ్లింది.
వింత ప్రేమాయణం
దీంతో కోపోద్రిక్తుడైన నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్‌పై స్థానిక పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టాడు. నీరజ్ కుమార్ సింగ్ ముఖేష్ సింగ్ ముందు భార్య రూబీ దేవి ఫోన్ నంబర్ సంపాదించాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా వారి మధ్య సంబంధం ఏర్పడింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 18న కోర్టు అనుమతితో నీరజ్ కుమార్ సింగ్, రూబీ దేవి వివాహం చేసుకున్నారు.
భూటాన్‌లో వింత రూల్..
పెళ్లి చేసుకున్న తరవాత వధువు వరుడి ఇంటికి వెళ్లడం ఆచారం. కానీ ఆ దేశంలో మాత్రం అలా కుదరదు. పెళ్లి చేసుకున్న తరవాత కూడా వధువు తన పుట్టింట్లోనే ఉండాలి. ఒకవేళ అత్తగారింటికి రావాలంటే డబ్బులు కట్టాలి. వింతగా ఉంది కదా ఈ రూల్. మన పొరుగున్న ఉన్న భూటాన్‌లోనే ఉందీ వెరైటీ చట్టం. భూటాన్‌కు చెందిన అబ్బాయిలు ఇండియాలోని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఈ రూల్ కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఒకవేళ పెళ్లి కూతుర్ని తనతో పాటు ఇంటికి తీసుకురావాలంటే ప్రభుత్వానికి రోజుకు రూ.1200 చెల్లించాలి. ఈ రూల్ కారణంగా ఇప్పటికీ చాలా మంది జంటలు కలిసి ఉండటం లేదు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 40 ఏళ్ల చోకీ వాంగ్మో..ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉండేందుకు నిరీక్షించాల్సి వస్తోంది. 2019లో పుష్పేంద్ర సింగ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. ఆ వ్యక్తి భూటాన్‌లో పని చేస్తున్నాడు. పైగా అతడు భారత దేశ పౌరుడు. అయితే...భూటాన్‌లో పని చేసేందుకు వర్క్ పర్మిట్ ఉంది. ప్రతి మూడు నెలలకోసారి వర్క్ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే...అక్కడికి తన భార్యను మాత్రం తీసుకెళ్లలేకపోతున్నాడు. మూడేళ్లుగా ఇలా ఇద్దరూ ఒక్కో చోట ఉంటున్నారు. నిజానికి..ఈ రూల్ గురించి తెలిసే వధువు వాళ్ల ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ఎలాగోలా బతిమాలి ఇద్దరూ పెళ్లి చేసుకున్నా..భూటాన్ ప్రభుత్వం పెట్టిన రూల్‌తో ఇలా వేరుగా ఉండాల్సి వస్తోంది.