Election Commission on EVM : ఎగ్జిట్ పోల్స్ తప్పయితే ఈవీఎంలను నిందిస్తారా ? విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ
EVM Row : ఎగ్జిట్ పోల్స్ తప్పయితే ఈవీఎంలను నిందించడం ఏమిటని ఈసీ ప్రశ్నించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఈసీ స్పందించారు.
EC questioned why the EVMs are to be blamed if the exit polls are wrong : హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే చివరికి బీజేపీ విజయం సాధించింది. దీంతో ఈవీఎంలపై అనేక ఆరోపణలు, అనమానాలను వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. పలు రకాల ఫిర్యాదులను చేసింది. ఈవీఎంల వల్లే ఓడిపోయామని అంటోంది. ఈ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ తో ఎన్నికల కమిషన్‌కు ఏమి సంబంధమని రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఎన్నికల ఫలితాలుకూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయని తర్వాత బీజేపీకి అనుకూలంగా మారాయని ఇది కూడా ఈవీఎంల తప్పేనని వస్తున్న విమర్శలపై స్పందించారు. కౌంటింగ్ మొదట్లో అధికారిక సమచారం రాదన్నారు. ఉదయం తొమ్మిదిన్నర వరకు అంట కౌంటింగ్ ప్రారంభమైన గంటన్నర వరకూ మీడియాలో ప్రచారం చేసే నెంబర్లు అధికారికం కాదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్, ఆధారం లేని వార్తలను పట్టుకుని ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రశ్నించడం కరెక్ట్ కాదని సీఈసీ స్పష్టం చేశారు. విమర్శలు, ఆరోపణలపై స్వీయ నియంత్రణ పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు.
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రజలే ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తారని అన్నారు. ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌గా ఉన్నాయని చెప్పారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల విషయంలో అనుమానాలు వ్యక్తం చేసేవారు మరింత పెరిగారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని అనుకున్నారు. అనుకున్నట్లుగా ముందుగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఆ పార్టీ విజయం ఖాయమనుకున్నారు. ఓ దశలో 90 స్థానాల్లో 70కిపైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.
నవంబర్ 20న పోలింగ్ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించడం ప్రారంభించిన తర్వాత బీజేపీ లీడ్ లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు మాత్రమే ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్నాయి. హర్యానాలో ఓట్లు వేసిన ప్రజలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అంత ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్ల వేసి ఉంటే.. ఖచ్చితంగా తమ అభిప్రాయాలను చెప్పేవారే. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా .. ఫలితాలు తారుమారయ్యాయని వాదించడం ప్రారంభించారు. దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చేసింది.