Jharkhand Assembly Elections : జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి, బీజేపీకి మధ్య ఆ రాష్ట్రంలో హోరాహోరీ పోరు సాగనుంది.
EC has announced the schedule for Jharkhand assembly elections 2024 : హేమంత్ సోరెన్ అరెస్టు దేశం మొత్తం హాట్ టాపిక్ అయిన జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొచ్చాయి. జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశలో అక్టోబర్ 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. రెండో విడతలో 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13వ తేదీన , రెండో దశ పోలింగ్ నవంబర్ ఇరవయ్యో తేదీన జరుగుతుంది. 23వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
Schedule for General Election to Legislative Assembly of #Jharkhand to be held in two phases.
— Election Commission of India (@ECISVEEP) October 15, 2024
Details in images👇#JharkhandAssemblyElections2024 #ECI #Schedule pic.twitter.com/mVOfJ5D7Pw
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి . ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇండీ కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
నవంబర్ 20న పోలింగ్ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
హేమంత్ సోరెన్ ను మధ్యలో ఈడీ అరెస్టు చేయడంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ నియమితులయ్యారు. అయితే హేమంత్ సోరెన్ మళ్లీ బెయిల్ మీద రావడంతో ఆయనకు రాజీనామా చేయక తప్పలేదు. తర్వాత ఆయన బీజేపీ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు హేమంత్ సోరెన్ నేతృత్వంలో జేఎంఎం, కాంగ్రెస్, వామపక్షాల కూటమి మరోసారి అధికారంకోసం ఎన్నికల బరిలో నిలుస్తోంది. హేమంత్ సోరెన్ ను అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజుల సానభూతి చూపిస్తారని మరోసారి విజయం సాధిస్తామని కాంగ్రెస్ కూటమి నమ్మకంగా ఉంది.
జార్ఖండ్ లో 2014లో బీజేపీ విజయం సాధించింది. రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా వ్యహరించారు. అప్పట్లో బీజేపీకి 49 సీట్లు వచ్చాయి. తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జార్ఖండ్‌లో గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈసీ తేదీలను ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది.
భద్రతాపరంగా జార్ఖండ్ ను సున్నితమైన ప్రాంతంగా గుర్తిస్తారు. మావోయిస్టుల ప్రాబల్యం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.