MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court : అంగ వైకల్యం ఉందని ఇక నుంచి ఎంబీబీఎస్ సీట్లను నిరాకరించడం సాధ్యం కాదు. ఈ అంశంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. .
Mere Benchmark Disability Won t Disqualify MBBS Candidate : 45 శాతం స్పీచ్, లాంగ్వేజ్ డిసేబులిటీ ఉన్న విద్యార్థికి శారీరక వైకల్యం కారణంగా మెడిసిన్ సీటు నిరాకరించడం సరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ బెంచ్ మార్క్ నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ఉన్న వారికే సీట్లు ఇస్తామని మిగతా వారు ఎంబీబీఎస్ చదవేందుకు అనర్హులని అనడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అతను డిసేబులిటి ఎసెస్‌మెంట్ బోర్డు పరీక్ష కూడా పాసయినా ఎంబీబీఎస్ చదివేందుకు అర్హులు కాదని చెప్పడం ఏమిటని ఆశ్చర్యపోయింది.
ఎంబీబీఎస్ చేయగలిగే సామర్త్యం ఉన్న వారిని కూడా ప్రత్యేకంగా కొన్ని బెంచ్ మార్క్ డిసేబులిటీస్ పెట్టుకుని అడ్మిషన్స్ నిరాకరించే విధానాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రివైజ్ చేయాలని సూచనలు జారీ చేసింది. మరింత విశాల దృక్పథంతో నిబంధనలు సరళీకరించాలని సూచించింది. ముంబైకి చెందిన ఓ విద్యార్థికి 40 శాతం కన్నా ఎక్కువ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసేబులిటీ ఉన్న కారణంగా సీటు నిరాకరించారు. ఆ విద్యార్థి ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆ విద్యార్థికి మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయితే పరిస్థితేంటి, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే వీలుందా?
సెప్టెంబర్ రెండో తేదీన పుణె గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు సాధించే అర్హత ఉందో లేదో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రూల్స్ ప్రకారం నలభై శాతం స్పీచ్ అండ్ లాంగ్వేజ్ వైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్లు క్రాస్ ఎగ్జామిన్ చేయాలని స్పష్టం చేసింది. ఆ విద్యార్థి డిసేబులిటీపై పరీక్షలు చేసిన వైద్యులు.. ఎంబీబీఎస్ చదివేందుకు అర్హుడేనని నివేదిక ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు చేసింది. గుడ్డిగా 40 నుంచి 45 శాతం డిసేబులిటీ ఉందని అడ్మిషన్‌కు అనర్హుల్ని చేయడం కన్నా ప్రత్యేకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఎగ్జామిన్ చేయాలని ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.