Maharashtra Election Schedule : నవంబర్ 20న పోలింగ్ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024కు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఓ కూటమిగా.. మహా వికాస్ ఆఘాడి మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
Maharashtra Assembly Elections 2024 : మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో నిర్వహించనున్నారు.
మహారాష్ట్రకు సంబంధించిన షెడ్యూల్ ఇదే
- నోటిఫికేషన్ ఎప్పుడు- అక్టోబర్22న నోటిఫికేషన్
- నామినేషన్ దాఖలకు లాస్ట్ డేట్- అక్టోబర్ 29
- పోలింగ్ తేదీ ఎప్పుడు- నవంబర్ 20న
- ఫలితాలు ఎప్పుడు-నవంబర్ 23న
Schedule for General Election to Legislative Assembly of #Maharashtra,2024 to be held in a single phase.
— Election Commission of India (@ECISVEEP) October 15, 2024
Details in images👇#MaharashtraAssemblyElections2024 #ECI #Schedule pic.twitter.com/XF4FXebtJR
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పట్లో బీజేపీ, శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. శివసేన 56 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ-శివసేన కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో ఎన్సీపీ 54 స్థానాలతో మూడో స్థానంలో, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
గత రెండేళ్లలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో అనేక రాజకీయ భూకంపాలు సంభవించాయి. మొదట శివసేనలో అంతర్గత తిరుగుబాటు వచ్చింది. 2019లో ఉద్ధవ్ ఠాక్రే భిన్నమైన వైఖరిని అవలంబించి కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏక్ నాథ్ షిండే ఎంవీపీని వీడి 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మహాకూటమిలో ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు.
ఆ తర్వాత అజిత్ పవార్ కూడా 2023లో మహాకూటమిలో చేరారు. ఏక్ నాథ్ షిండే పార్టీని పూర్తిగా చీల్చి బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఈ కారణంగా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. అసలు పార్టీలను చీలిక వర్గాలు దక్కించుకున్నాయి. శివసేన పార్టీ గుర్తు ఇప్పుడు ఏక్ నాథ్ షిండే చేతుల్లో ఉంది. అలాగే ఎన్సీపీ గుర్తు అజిత్ పవార్ వద్ద ఉంది. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ఇద్దరూ వేర్వేరుగా పార్టీలను పెట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ వీరు మంచి ఫలితాలు సాధించారు.
మహారాష్ట్రలో ఇప్పుడు రెండు కూటముల మధ్య పోరాటం సాగనుంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఓ కూటమిగా.. కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవర్, శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ మహా వికాస్ ఆఘాడిగా పోటీ చేయబోతున్నాయి. ఈ రెండు కూటముల పోటీ రసవత్తరంగా ఉండనుంది. కాంగ్రెస్ కూటమితో జత కలిసేందుకు మజ్లిస్ కూడా ఆసక్తిగా ఉంది. గత ఎన్నికల్లో మజ్లిస్ మంచి ప్రభావాన్ని చూపించింది.