Caste Based Census: ప్రధానితో బిహార్ నేతల భేటీ.. కులాలవారీగా జనగణనపై డిమాండ్
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలతో కలిసి బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ అంశంపై మోదీ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కులాల వారీగా జనగణన చేపట్టాలని 10 మంది నేతల బృందంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయంపై మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనను ప్రధాని ఓపికగా విన్నరాని నితీశ్ పేర్కొన్నారు.
Delhi | People in Bihar and the entire country are of the same opinion on this issue. We are grateful to the PM for listening to us. Now, he has to take a decision on it: Bihar CM Nitish Kumar on meeting with PM Narendra Modi over caste census pic.twitter.com/8e2F0LYoNo
— ANI (@ANI) August 23, 2021
ప్రధానిని కలిసిన బృందంలో బిహార్ ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
గత నెలలో పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీల జనాభా మాత్రమే లెక్కిస్తామని కేంద్రం చేసిన ప్రకటన నేపథ్యంలో కుల గణన అంశం బయటకొచ్చింది. బిహార్ వంటి రాష్ట్రాల్లో మండల్ కమిషన్ కాలం నుంచే ఓబీసీలదే రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగుతోంది. వెనుకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉండటం వల్ల కులగణన చేపట్టాలని బిహార్ రాజకీయ పార్టీలు ఎప్పటినుంచో కోరుతున్నారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కానీ కేంద్రం ఇందుకు విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందంతో ప్రధానిని నేడు నితీశ్ కుమార్ కలిశారు.