Dead Man Alive: ఇదేం ట్విస్ట్‌రా నాయనా..! చనిపోయాడనుకుంటే మార్చురీ నుంచి మళ్లొచ్చాడు!
చనిపోయిన వ్యక్తి తిరిగి బతికొస్తే..! అవును ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అందేంటో మీరే చూడండి.
చనిపోయిన వ్యక్తి బతికొస్తే..! ఇదేం ప్రశ్నరా బాబు.. అనుకుంటున్నారా? మరి అలాంటి ఘటనే జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చనిపోయాడుకున్న వ్యక్తి 7 గంటల తర్వాత తిరిగి లేచాడు!
అసలేం జరిగింది?
ఉత్తర్‌ప్రదేశ్ మోరదాబాద్‌కు చెందిన ఓ 40 ఏళ్ల శ్రీకేశ్ కుమార్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి ఓ మోటార్ బైక్ అతడ్ని ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఏం ట్విస్ట్ రా?
అయితే తరువాతి రోజు పంచనామా చేయడానికి అతని మృతదేహాన్ని మార్చురీలోని ఫ్రీజర్‌లో పెట్టేశారు. అయితే ఎవరైనా చనిపోయిన 7 గంటల తర్వాత పంచనామా చేసేందుకు కుటుంబసభ్యుల ఆమోదం తీసుకుంటారు పోలీసులు. ఇందుకోసం అతని కుటుంబం సంతకం పెట్టే సమయానికి చనిపోయిన శ్రీకేశ్ కుమార్ మృతదేహం కదలడాన్ని అతని సోదరి గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులు, వైద్యులకు తెలిపారు.
వెంటనే అతని మృతదేహాన్ని ఫ్రీజర్‌లోంచి తీసి మేరఠ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని కండిషన్ బావున్నట్లు వైద్యులు తెలిపారు. అతడు త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెప్పిట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే చనిపోయాడనకున్న వ్యక్తి తిరిగిరావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. కానీ ఇది ఎలా సాధ్యమైందోనని జనాలు జుట్టు పీక్కుంటున్నారు.
Also Read: Taj Mahal Like Home: మధ్యప్రదేశ్‌లో మరో షాజహాన్.. భార్యకు ప్రేమతో 'తాజ్‌మహల్' కట్టేశాడు!
Also Read: Tamil Nadu Crime: భర్తను బతికుండగానే పాతేసిన భార్య.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్ అవుతారు!
Also Read: Farmers Protest: నవంబర్ 29న రైతుల 'చలో పార్లమెంట్'.. మోదీ సర్కార్‌కు తప్పని నిరసన సెగ
Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 249 మంది మృతి
Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు