అన్వేషించండి

BSP MLA : పద్దతిగా లంచాలు తీసుకోవాలని ఉద్యోగులకు ఎమ్మెల్యే పాఠాలు ! ఇంకా నయం వాటాలు అడగలేదని సెటైర్లు !

మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే ఉద్యోగులకు ఎలా లంచాలు తీసుకోవాలో పాఠాలు చెప్పిన వ్యవహారం వైరల్ అయింది.


లంచాలు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరమని మన చట్టాలు చెబుతూంటాయి. అదే పనిగా ప్రచారం కూడా చేస్తూంటారు. కానీ ఎక్కడా లంచాలు ఇవ్వడం.. తీసుకోవడం అనేవి అగడం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు చేసిన ప్రజా ప్రతినిధులే వాటిని పట్టించుకోవద్దని నేరుగా చెబుతూ ఉంటారు కాబట్టి. మధ్యప్రదేశ్‌లో బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు లంచాలు ఎలాపద్దతిగా తీసుకోవాలో ప్రభుత్వ ఉద్యోగులకు పాఠాలు చెబుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read : కాంగ్రెస్ గూటికి చేరిన కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ

మధ్యప్రదేశ్‌లో బీఎస్పీకి రాంబాయి సింగ్ అనే ఎమ్మెల్యే ఉన్నారు. ఆమె నియోజకవర్గంలో ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ గ్రామస్తులంతా కలిసి ఆమెకు అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద తమకు ఇళ్లు మంజూరు చేయడానికి పంచాయతీ సిబ్బంది లంచం తీసుకొన్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో అటు గ్రామస్తులు.. ఇటు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. 

Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!

గ్రామస్తులు ఎవరెవరు ఎంతెంత లంచం ఇచ్చారు.. ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలని హుకుం జారీ చేశారు. గ్రామస్తులు ఎవరికైతే లంచం ఇచ్చారో వారి వైపు చూపిస్తూ ఎంత ఎంత ఇచ్చారో చెప్పారు. గ్రామస్తులే కాదు ఇతరులు కూడా ఏమనుకుంటారు ...  లంచంగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇప్పించేసి వారిపై  చర్యలు తీసుకుంటారని అనుకుంటారు. కానీ ఆమె మాత్రం వెంటనే వారికి లంచాల పాఠాలు చెప్పడం ప్రారంభించారు. 

 BSP MLA Rambai Singh : “It is alright to indulge in corruption equivalent to the amount of salt added in flour, but you should not snatch the entire plate from someone.”#BahujanSamaj #Mayawati pic.twitter.com/OgXI5MDbn3

Also Read : చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!

లంచం తీసుకోండి. కానీ...దానికో పద్దతి ఉంటుంది. పిండిలో ఉప్పు మాదిరిగా లంచం తీసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్లుగా తీసుకోకూడదు. గ్రామస్థులు అందరి దగ్గరా ఒకేలా తీసుకోలేదు. అందరూ చిన్నాచితకా పనులు చేసుకొనేవాళ్లే.. అందుకే కొంత ఉంచుకుని మిగతా ఇచ్చేయండి అని ఆదేశించారు.  లంచాల విషయంలో ఆమె పంచాయతీ అందరికీ నచ్చింది. కొంతమంది మాత్రం ఇంకా నయం తనకు కూడా వాటా ఇవ్వాలని అడగలేదని సెటైర్లు వేసుకున్నారు . మరికొందరు మాత్రం లంచాలు తీసుకోకుండా ఆపలేరు కాబట్టి పేదల్ని పీడించకుండా ఆమె మంచి ఫార్ములా చెప్పారని అంటున్నారు.  మొత్తానికి ఈ లంచాల పంచాయతీ వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read : వీడెవడెండి ..బాబూ ! మద్యం మత్తులో తన కోసం వెదుక్కున్న మందుబాబు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: దొంగ ఓట్లతో 2024 ఎన్నికలు.. సీఈసీ జైలుకు వెళ్లక తప్పదు -రాహుల్ గాంధీ
దొంగ ఓట్లతో 2024 ఎన్నికలు.. సీఈసీ జైలుకు వెళ్లక తప్పదు -రాహుల్ గాంధీ
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అత్యధికంగా గూడురులో 83.6 శాతం నమోదు
Team India Sixes Record: 400 సిక్సర్లతో టీమిండియా వరల్డ్ రికార్డు .. గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలోనూ అరుదైన ఘ‌న‌త‌ 
400 సిక్సర్లతో టీమిండియా వరల్డ్ రికార్డు .. గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలోనూ అరుదైన ఘ‌న‌త‌ 
AP Local Body Elections Live updates: ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో ముగిసిన పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget