Congress: కాంగ్రెస్ గూటికి చేరిన కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ
కన్హయ్య కుమార్, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో దిల్లీలో వీరిద్దరూ ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో కన్హయ్య, మేవానీ చేరిక కీలకం కానుందని విశ్లేషకులు అంటున్నారు.
#WATCH | CPI leader Kanhaiya Kumar and Gujarat MLA Jignesh Mewani meet Congress leader Rahul Gandhi at Shaheed-E-Azam Bhagat Singh Park, ITO, Delhi pic.twitter.com/gMhDJpbGH9
— ANI (@ANI) September 28, 2021
Since Independence, Congress has followed the ideals of listening to the needs of this country.
— Maanmohan Singh Pahujaa (@msgpahujaa) September 28, 2021
The Congress party has been an umbrella organisation for different ideas, ideologies & thoughts to co-exist peacefully.
Welcome to the Congress @kanhaiyakumar & @jigneshmevani80 pic.twitter.com/B53wZr2EKb
హార్దిక్ పటేల్ హర్షం..
కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ పార్టీలో చేరడంపై గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. తామంతా అభివృద్ధి గురించి మాట్లాడే నేత కింద పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
విద్యార్థి నేతగా..
- దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా కన్హయ్య కుమారు గతంలో పనిచేశారు.
- 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)లో కన్హయ్య కుమార్ చేరారు.
- బిహార్‌లోని బెగుసరాయ్ స్థానం నుంచి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
- చివరికి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు కన్హయ్య కుమార్.
ఉద్యమ నేతగా..
రాష్ట్రీయ దళిత అధికార మంచ్ (ఆర్‌డీఏఎమ్) కన్వీనర్‌గా మేవానీ ఉన్నారు. 2017 లో కాంగ్రెస్ మద్దతుతో గుజరాత్‌లోని వడ్గామ్ అసెంబ్లీ స్థానంలో పోటీచేసి గెలిచారు.
Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి