అన్వేషించండి

Man Search For Him : వీడెవడెండి ..బాబూ ! మద్యం మత్తులో తన కోసం వెదుక్కున్న మందుబాబు !

మద్యం మత్తులో తప్పిపోయానని తన కోసం పోలీసులు వెదుకుతూంటే వారితో కలిసి తానూ వెదికాడు మందు బాబు. చివరికి ఆ వెదుకుతున్న వ్యక్తి తమతోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే..?


" ఎమ్మెస్ నారాయణ బార్ నుంచి బయటకు వస్తాడు. ఆటో ఎక్కుతాడు. ఎక్కడకు వెళ్లాలో చెబుతాడు. ఆటో బయలుదేరడానికి టర్న్ తీసుకుని ఆగుతుంది. వెంటనే ఆటో దిగిపోయే .. ఇంత వేగంగా తీసుకొచ్చేశావ్ అని డ్రైవర్‌ని అభినందించి డబ్బులిచ్చి మళ్లీ బార్‌లోకి వెళ్లిపోతాడు.." ఇది ఓ సినిమాలో హిట్ కామెడీ సీన్.  ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడతాడు " రాత్రి పార్టీలో బాగా తాగాను అయినా స్టడీగా ఉన్నాను. కానీ రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా క్యాబ్ మాట్లాడుకుని వెళ్లాను " అని ఆ పోస్ట్ సారాంశం. అందరూ అభినందిస్తారు. కానీ ఒక మిత్రుడు మాత్రం " మీ ఇంట్లోనే కదా పార్టీ జరిగింది క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కడికి వెళ్లావ్ " అనే సందేహాన్ని కామెంట్ రూపంలో పెడతారు. అతను ఎక్కడికి వెళ్లాడో వెదుక్కోవడం తర్వాత పని. 

Also Read : పేరెంట్స్‌తో వస్తేనే బర్గర్ షాపులోకి అనుమతిస్తాం... 18 సంవత్సరాలలోపు వారికి బర్గర్ షాప్ ఆర్డర్

ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెబుతున్నామంటే... ఇవి జోకులు మాత్రమే కాదు.. ఇలాంటి వాళ్లు ఉంటారని చెప్పడానికి. టర్కీలో ఓ వ్యక్తి మద్యం సేవించి కనిపించకుండా పోయాడు. ఆతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. ఎంత వెదికినా కనిపించలేదు. ఎందుకంటే... అలా వెదికిన బృందంలో ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్లతో పాటే తన కోసం తను వెదికాడన్నమాట. ఈ విచిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Also Read : పాక్ కోర్టులో బంట్రోతు ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు!

టర్కీకి చెందిన బెహాన్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. తర్వాత అతను అడవిలోకి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. దాంతో అతని స్నేహితుల్లో ఆందోళన పెరిగిపోయింది. వెతికి.. వెతికి ఇక లాభం లేదనుకుని.. ఆలస్యమైతే మిత్రుడు అన్యాయమైపోతాడని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు పలు బృందాలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వారికి స్థానికులు కూడా కొంత మంది సహకరించారు. 

Also Read : ఈ చాక్లెట్లలో రక్తాన్ని కలుపుతారు.. ఎందుకో తెలుసా?

తీవ్ర గాలింపు తర్వాత ఇక లాభం లేదనుకుని మైక్ సెట్లలో పిలవడం ప్రారంభించారు. బుహాన్ ఎక్కడున్నా శబ్దం చేయి రక్షిస్తాం అని అరవడం ప్రారంభించారు. అలా అరుస్తున్న ఓ గుంపులో బుహాన్ కూడా ఉన్నాడు. మెల్లగా తానే బుహాన్‌ను అని చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. నిజానికి ఎవరి కోసం వెదుకుతున్నారో బుహాన్‌కు కూడా తెలియదు. తను తప్పిపోయానని ఆయన అనుకోలేదు. తన స్నేహితులు తను తప్పిపోయానని పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలియదు. తన కోసం వెదుకుతున్నారని అనుకోలేదు. అందుకే తన కోసం జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో తను కూడా పొల్గొన్నాడు. చివరికి విషయం తెలుసుకుని సీరియస్ అయిన సెర్చ్ టీమ్స్.. తర్వాత నవ్వుకుని బుహాన్‌ను ఇంటివద్ద వదిలి పెట్టాయి. తాగుబోతుల వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అవుతూనే ఉంటాయి. 

Also Read : విపరీతంగా వైరల్ అయిన ఆ 'ది న్యూయార్క్ టైమ్స్' న్యూస్ క్లిప్ ఫేక్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
ABP Desam Top 10, 11 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 11 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget