Pakistan Unemployment: పాక్ కోర్టులో బంట్రోతు ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు!
పాకిస్థాన్ కోర్టులో బండ్రోతు ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
'మా దేశంలో నిరుద్యోగ రేటు 6.5 శాతంగా ఉంది'.. ఇవి అక్షరాలా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాటలు. కానీ అక్కడి పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకానమిక్స్ (పీఐడీఈ) వివరాల ప్రకారం.. దేశంలో నిరుద్యోగ రేటు 16 శాతం కంటే ఎక్కువ ఉంది. పాక్‌లోని చదువుకున్న యువతలో 24 శాతం మందికి ఉద్యోగాలు లేవని పీఐడీఈ పేర్కొంది.
పాకిస్థాన్ కోర్టులో ఓ బంట్రోతు ఉద్యోగానికి 15 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ పత్రికలు వార్త ప్రచురించాయి. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ మంది ఎంఫిల్ డిగ్రీ చేసినవాళ్లే.
ప్రణాళిక, అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సెనేట్ స్థాయి సంఘానికి ఇచ్చిన నివేదికలో పీఐడీఈ పలు విషయాలను వెల్లడించింది. దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ చేసిన వారిలో 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపింది.
ఆర్థిక సంక్షోభంలో..
ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతలా అంటే చివరకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవనాన్నే అద్దెకు ఇచ్చేంత స్థాయికి పడిపోయింది. ఇటీవల వచ్చిన ఈ వార్తలు పాక్ ఆర్థిక స్థితిని తెలియజేస్తున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ అధికారిక భవనం ఇస్లామాబాద్‌లో ఉంది. ఇదివరకు దీన్ని యూనివర్శిటీగా మార్చుతామని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (PTI) ప్రభుత్వం ప్రకటించింది. అది ఆచరణలోకి రాలేదు. అయితే ఉన్నట్టుండి ఈ భవనాన్ని అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో కల్చరల్, ఫ్యాషన్, ఎడ్యుకేషనల్, ఇతర ఈవెంట్లు జరుపుకోవడానికి ఇస్తారట. అంటే దాదాపు ఇదో ఈవెంట్స్ ఫంక్షన్ హాల్ కాబోతుందని సమాచారం.
ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని అయ్యాక ఆ దేశ ఆర్థిక స్థితి మరింత దిగజారింది. మూడేళ్లలో దేశ ఎకానమీ 19 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే ఇమ్రాన్ దేశ ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు పలు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఆలోచన చేశారు.
Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!
Also Read: Indian Army: ఉరీ సెక్టార్‌లో ప్రత్యేక ఆపరేషన్.. 7 రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులు ఔట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి