Indian Army: ఉరీ సెక్టార్‌లో ప్రత్యేక ఆపరేషన్.. 7 రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులు ఔట్
దేశంలోకి చొరబడాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేసింది.
జమ్ముకశ్మీర్ ఉరీ సెక్టార్‌లో సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. దేశంలోకి చొరబడాలని వీరు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం అడ్డుకుంది.
Uri | One terrorist neutralized, another terrorist caught during an operation in the Uri sector of Jammu and Kashmir: Major General Virendra Vats, GOC, 19 Infantry Division pic.twitter.com/YbJIEKBDdz
— ANI (@ANI) September 28, 2021
One LeT terrorist Ali Babar Patra from Okhara, Punjab in Pakistan surrendered before security forces during an operation in the Uri sector of Jammu and Kashmir: Indian Army pic.twitter.com/M7URcShc9Z
— ANI (@ANI) September 28, 2021
సాల్మాబాద్ నాలా ప్రాంతంలోని సరిహద్దు గుండా భారత్లోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. చొరబాటును సైన్యం విజయవంతంగా అడ్డుకుందని పేర్కొన్నారు.
మరో ఆపరేషన్..
మరోవైపు పుల్వామా జిల్లాలో పోలీసులు, జవాన్లు కలిసి ఉగ్రవాద శిబిరం గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు. నిఘా వర్గాల సమచారం మేరకు ఉగ్రవాదులు తలదాచుకునే శిబిరాన్ని బలగాలు గుర్తించాయి. అయితే తనిఖీ చేసిన సమయంలో అందులో ఉగ్రవాదులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సైతం లభించలేదని చెప్పారు.
Also Read:Navjot Singh Sidhu Resign: పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. అమరీందర్ సింగ్ కౌంటర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి