ఇది కొత్త ప్రాజెక్టు కాదు. శ్రీశైలంలో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా పాత కాల్వలకు నీటిని ఎత్తిపోసి, రాయలసీమకు కేటాయించిన జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడమే దీని ఉద్దేశ్యం. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిది.
Ralayaseema Lift Scheme: రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు.. సీఎం చంద్రబాబు మౌనం ఎందుకు? - వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
Ralayaseema Lift Scheme: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై విమర్శలు సరికాదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తెలిపారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఇన్సూరెన్స్ స్కీమ్ అని పేర్కొన్నారు.

- రాయలసీమ లిఫ్ట్ కొత్త పథకం కాదని జగన్ వివరించారు.
- తక్కువ శ్రీశైలం నీటిమట్టాల వద్ద రాయలసీమకు నీటికోసం ఉద్దేశ్యం.
- దాదాపు పూర్తైన పనులను చంద్రబాబు ఆపడంపై జగన్ విమర్శించారు.
Ralayaseema Lift Scheme: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై తెలంగాణ రాజకీయ పార్టీల విమర్శలతో వాస్తవాలను తెలియడంలేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ కారణాలతో మౌనంగా ఉన్నారని విమర్శించారు.
రాయలసీమ లిఫ్ట్ స్కీం.. కొత్త ప్రాజెక్టు కాదు!
"వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం ఏమాత్రం కొత్త ప్రాజెక్టు కాదు. ఈ ప్రాజెక్టులో అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, అదనపు రిజర్వాయర్లు లేదా అదనపు ఆయకట్టు ఏవీ లేవు. అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి పాత కాల్వల ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిదే. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో (44,000 క్యూసెక్కులు) నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటి మట్టం కనీసం 880 అడుగుల పైన ఉండాలని, 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేని పరిస్థితి ఉంది" -వైఎస్ జగన్
Also Read: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పణ.. రూ.206 కోట్ల భారీ విరాళంపై సీఎం చంద్రబాబు హర్షం!
తెలంగాణ ప్రాజెక్టులు
కృష్ణానది ద్వారా ఏపీకి వచ్చే నీళ్లు తగ్గుతున్న నేపథ్యంలో, వచ్చిన నీటిని కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదిలేయడం మరో సమస్యగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. మరోవైపు శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు తెలంగాణ పలు ప్రాజెక్టుల ద్వారా రోజుకు సుమారు 3 టీఎంసీల సామర్థ్యంతో ముందుకు వెళ్తోందని ఆరోపించారు.
- పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు
- డిండి ద్వారా రోజుకు 0.5 టీఎంసీలు
- కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీలు
- ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీలు
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సమయంలో, నీటిని లిఫ్ట్ చేసి అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి ఎత్తిపోసి పాత రిజర్వాయర్లకు చేరవేయడమే రాయలసీమ లిఫ్ట్ స్కీం ప్రధాన ఉద్దేశమని వైఎస్ జగన్ అన్నారు. నీటి కేటాయింపులు ఉన్నా వినియోగించుకునే అవకాశం లేకపోతే వాటికి సార్థకత ఏముంటుందని ప్రశ్నించారు.
పనులు ఆపేయడంపై విమర్శలు
దాదాపు పూర్తైన రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే నిలిపివేశారని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ స్కీమ్ ఆవశ్యకతను బలంగా చెప్పాల్సింది పోయి, రాజకీయ కారణాలతో పనులను ఆపి రాయలసీమ ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలిగించారని ఆరోపించారు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
Also Read : వైఎస్ షర్మిల అల్లుడు ఏం చేస్తుంటాడో తెలుసా?.. రఘురామ్ రెడ్డి పూర్తి వివరాలు!
Frequently Asked Questions
రాయలసీమ లిఫ్ట్ స్కీం అంటే ఏమిటి?
శ్రీశైలంలో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు ఎదురయ్యే సమస్య ఏమిటి?
శ్రీశైలంలో నీటిమట్టం 880 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పారతాయి. 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లు పంపలేని పరిస్థితి ఉంటుంది, ఈ సమస్యను అధిగమించడానికి ఈ పథకం.
రాయలసీమ లిఫ్ట్ స్కీంను ఎందుకు ప్రారంభించారు?
శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే నీళ్లు పంపలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రాజెక్టులు దిగువకు నీటిని వదులుతుండటంతో, నీటి లభ్యత తగ్గింది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో నీటిని వినియోగించుకునేందుకు దీనిని ప్రారంభించారు.
రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులను చంద్రబాబు ఎందుకు ఆపేశారని జగన్ ఆరోపించారు?
దాదాపు పూర్తైన ఈ స్కీం పనులను చంద్రబాబు రాజకీయ కారణాలతో నిలిపివేశారని జగన్ విమర్శించారు. దీనివల్ల రాయలసీమ ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలిగిందని ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















