Burger: పేరెంట్స్‌తో వస్తేనే బర్గర్ షాపులోకి అనుమతిస్తాం... 18 సంవత్సరాలలోపు వారికి బర్గర్ షాప్ ఆర్డర్
ఓ బర్గర్ సెంటర్ వారు 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారు ఎవరైనా సరే తమ తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ వెంట వస్తేనే లోపలికి అనుమతి ఇస్తారంట.
ఓ బర్గర్ సెంటర్ వారు 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారు ఎవరైనా సరే తమ తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ వెంట వస్తేనే లోపలికి అనుమతి ఇస్తారంట. ఇంతకీ ఈ సెంటర్ ఎక్కడ? అనే కదా మీ సందేహం.
ఈ బర్గర్ సెంటర్ అమెరికాలోని కాలిఫోర్నియా గార్డెన్ వ్యాలీలో ఉంది. దీని పేరు Red Rooster Burger and Brew. ఇంతకీ వీరు ఎందుకు ఇలా చేశారంటే... గత రెండు సంవత్సరాల నుంచి ఆ సెంటర్ సిబ్బంది 18 ఏళ్లలోపు వారు ఆ సెంటర్‌కి వచ్చి చేసిన ఆగం అంతా ఇంతా కాదు. అది తట్టుకోలేకే వాళ్లు అలా చేశారంట. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తమ ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
Also Read: బస్సుపై ఏనుగు దాడి... భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు... డ్రైవర్ పై నెటిజన్ల ప్రశంసలు
చాలా మంది స్కూల్ తర్వాత మా షాప్‌కి వచ్చేవారు. బాత్రూమ్‌లో స్మోకింగ్ చేసే వాళ్లు, బంగాళదుంప ఫ్రైస్ సెంటర్ సిబ్బందిపై విసిరేవారు, బాత్రూమ్‌లో కండోమ్స్ దొరికాయి. టమాటా కెచప్‌లను టెలివిజన్, సీలింగ్‌లో దాచి పెట్టేవారు. ఇవన్నీ తట్టుకోలేక ఈ నిబంధనను తీసుకువచ్చాం అని సెంటర్ సిబ్బంది చెప్పారు. సుమారు రెండు సంవత్సరాల పాటు ఇవన్నీ భరించాం. ఎన్నోసార్లు వారికి చెప్పాం. కానీ, ఎలాంటి మార్పు లేదు. అందుకే ఇలా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. బర్గర్ సెంటర్ వారు పిల్లలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ వారి ఫేస్ బుక్ పోస్టులో వివరించారు. ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సెంటర్లు తమ ఏరియాల్లోనూ ఉంటే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఇది మంచి ఆలోచన అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఆలోచన నిజంగానే బాగుంది కదా. మీరేమంటారు మరి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి