(Source: ECI/ABP News/ABP Majha)
WATCH: బస్సుపై ఏనుగు దాడి... భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు... డ్రైవర్ పై నెటిజన్ల ప్రశంసలు
ఓ ఏనుగు ఆర్టీసీ బస్సుపై దాడి చేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఏనుగుల ప్రవర్తన ఏ సమయంలో ఎలా ఉంటుందో ఊహించలేం. కొద్ది రోజుల క్రితం ఓ గుడి వద్ద ఏనుగు మావటివాడు ఎక్కిన తర్వాత గందరగోళం చేసింది. అటూ ఇటూ పరిగెడుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ క్రమంలో ఆ మావటివాడు కింద పడిపోయాడు. దీప స్తంభం కూడా విరిగిపోయింది.
Huge respect for the driver of this Government bus in Nilgiris who kept his cool even under the terrifying hits on the bus from an agitated tusker.He helped passengers move back safely, in an incident today morning. Thats why they say a cool mind works wonders VC- by a friend pic.twitter.com/SGb3yqUWqK
— Supriya Sahu IAS (@supriyasahuias) September 25, 2021
తాజాగా ఓ ఏనుగు ఆర్టీసీ బస్సుపై దాడి చేసింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఏనుగు బస్సుపై దాడి చేసే వీడియోను IAS సుప్రియ సాహు తన ట్విటర్ ద్వారా నెటిజన్లతో పంచుకోవడంతో ఇది కాస్త వైరలైంది. అసలేం జరిగిందంటే... తమిళనాడులోని నీల్‌గిరీస్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా... ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఏనుగు హఠాత్తుగా వచ్చి బస్సు ఎదురుగా నిల్చుంది. అనంతరం ఆ ఏనుగు దంతాలతో డ్రైవర్ ముందున్న అద్దంపై దాడి చేసింది. ఆ తర్వాత మరో పక్క అద్దంపై కూడా దాడి చేసింది. డ్రైవర్ రివర్స్ గేర్ వేసి దాడికి దూరంగా జరిగాడు. కానీ, ఏనుగు ఊరుకోలేదు. ఈ క్రమంలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తనపై నుంచి దృష్టి మళ్లించేందుకు తన సీటులో నుంచి లేచి వెనక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియోను తమిళనాడు Principal Secretary of Environment Climate Change & Forest అధికారి సుప్రియ సాహు ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
Can anyone suggest what one should do in situations like these? Wait till the tusker moves away or honk or try to reverse?
— Bipin_K (@BipinChandranK) September 25, 2021
డ్రైవర్ ఎంతో కూల్‌గా వ్యవహరించాడు. అందుకే ప్రయాణికులంతా జాగ్రత్తగా తిరిగి ఇళ్లకి వెళ్లారు అని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా ఇలాంటి ఘటనే ఎదురైతే... ఏం చేయాలి? అని ప్రశ్నించారు. చాలా మంది నెటిజన్లు చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
Presence of mind.. 👍👍
— Satheesh Kumar (@saysatheesh) September 25, 2021
Drivers need this courage and coolness to handle such situations..
Reversing the Bus in a Ghat section when an animal conflict is so risk but still he handled it maturedly. 👏👏
TNSTC can proud of its drivers
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి