అన్వేషించండి

Bajaj Pulsar 180 Relaunched: పల్సర్ 180 కమ్‌బ్యాక్ – క్లాసిక్ లుక్, మోడర్న్ టెక్నాలజీతో బజాజ్ కొత్త మాస్టర్ ప్లాన్!

బజాజ్ ఆటో తన ఐకానిక్ పల్సర్ 180 బైక్‌ను సరికొత్త ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ మీటర్ వంటి అప్‌డేట్స్‌తో రూ. 1.22 లక్షల ధరకే మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేసింది.

Bajaj Pulsar 180 Relaunched News: ఇండియ‌న్ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన బజాజ్ పల్సర్ 180 మళ్ళీ పట్టాలెక్కింది. పర్ఫార్మెన్స్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బైక్‌ను 2022లో కంపెనీ నిలిపివేసింది. అయితే, ఈ పేరుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని బజాజ్ ఆటో ఈ మోడల్‌ను 2026 వెర్షన్‌గా సరికొత్త అప్‌డేట్స్‌తో మళ్ళీ లాంచ్ చేసింది. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.22 లక్షలుగా నిర్ణయించడమే కాకుండా, పాత పల్సర్ డీఎన్ఏ (DNA) దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది.

నమ్మకమైన ఇంజిన్ - పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..
కొత్త పల్సర్ 180లో మనకు పాత నమ్మకమైన 178.61 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌నే అందించారు. ఇది 8,500 ఆర్పీఎమ్ వద్ద 16.77 బిహెచ్‌పి పవర్, 6,500 ఆర్పీఎమ్ వద్ద 15 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ 180కి ఉన్న పవర్‌ఫుల్ మిడ్-రేంజ్ పర్ఫార్మెన్స్ దీనివల్ల మళ్ళీ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. సిటీలో ప్రయాణాలకైనా, లాంగ్ రైడ్స్‌కైనా ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

స్టైలిష్ లుక్ ..
డిజైన్ పరంగా బజాజ్ ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఐకానిక్ పల్సర్ సిల్హౌట్‌ను అలాగే ఉంచింది. కండలు తిరిగినట్లు ఉండే ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, స్పోర్టీ స్టాన్స్ దీనికి పాత గుర్తింపును ఇస్తాయి. అయితే, మోడ్రన్ లుక్ కోసం కారు అంతటా బ్లాక్-అవుట్ పెయింట్ థీమ్‌ను వాడారు. బాడీ గ్రాఫిక్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఫ్రంట్ మడ్‌గార్డ్ పైన కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల బైక్‌కు ఒక ప్రీమియం స్పోర్ట్స్ బైక్ ఫీల్ వస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. .

ఎల్ఈడీ (LED) లైటింగ్ - డిజిటల్ డిస్‌ప్లే..
ఈసారి అతిపెద్ద మార్పు ఏమిటంటే హెడ్ లైట్ సెటప్. పాత హాలోజన్ బల్బుల స్థానంలో పవర్‌ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌ను అమర్చారు. దీనివల్ల రాత్రి పూట ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. చూపు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే టర్న్ ఇండికేటర్లను కూడా ఎల్ఈడీ యూనిట్లుగా మార్చారు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, పల్సర్ 150, 220ఎఫ్ మోడళ్లలో ఉన్నట్లే ఫుల్లీ డిజిటల్ ఎల్‌సీడీ (LCD) డిస్‌ప్లేను ఇందులో జత చేశామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.  

ధర - మార్కెట్ పొజిషన్..
బజాజ్ పల్సర్ 180 కేవలం ఒకే ఒక వేరియంట్‌లో రూ. 1.22 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో అందుబాటులో ఉంటుంది. బజాజ్ లైనప్‌లో ఇది సరిగ్గా పల్సర్ 150, పల్సర్ 220ఎఫ్ మధ్యలో స్థానం సంపాదించుకుంది. తక్కువ ధరలో ఎక్కువ పవర్ కోరుకునే కుర్రాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హోండా ఎక్స్-బ్లేడ్ లేదా టీవీఎస్ అపాచీ 180 వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget