MM Naravane: 'దేశ రక్షణలో స్త్రీ శక్తి.. మహిళలకు సాదరంగా ఆహ్వానం పలుకుదాం'
దేశ రక్షణ కోసం వచ్చే మహిళలను సాదరంగా ఆహ్వానించాలని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే పిలుపునిచ్చారు.
పుణెలో జరిగిన ఎన్డీఏ 141వ పాసింగ్ అవుట్ పరేడ్‌ను సైన్యాధిపతి ఎంఎం నరవాణే సమీక్షించారు. ఈ సందర్భంగా మహిళా క్యాడెట్లను సాదరంగా స్వాగతించాలని కోరారు. మహిళా క్యాడెట్లకు ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) వృత్తి నిబద్ధత, నిష్పక్షపాతంతో ఆహ్వానం పలకాలని పిలుపునిచ్చారు.
Maharashtra | As we open gates of NDA for women cadets, I expect you all to welcome them with the same sense of fair play & professionalism as Indian armed forces are known for the world over: Army Chief Gen MM Naravane at passing out Parade of 141st Course of NDA in Pune pic.twitter.com/Gysnp2aMp5
— ANI (@ANI) October 29, 2021
General MM Naravane #COAS reviewed the Passing Out Parade of 141st NDA Course at National Defence Academy #NDA and complimented the cadets for an impeccable parade. 305 Cadets graduated from #NDA including 19 from Friendly Foreign Countries.
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 29, 2021
"Victory Through Jointness" pic.twitter.com/HkFRxMxKcE
మహిళల కోసం ఎన్డీఏ ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది మే నెలలో నిర్వహిస్తామని గత నెలలో సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. అయితే అప్పటివరకు వాయిదా వేయడం తగదని, ఈ నవంబర్లోనే పరీక్షలు పెట్టాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
రాజ్‌నాథ్ ఆకాంక్ష..
దేశ రక్షణలో మహిళల ప్రాతనిధ్యం పెరగాలని ఇటీవల షాంఘై సహకార సదస్సుకు సంబంధించిన వెబినార్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తుచేశారు. దేశాన్ని పాలించడానికే కాదని సైన్యాన్ని నడిపించే స్థాయికి కూడా మహిళలు ఎదుగుతారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత సైన్యంలో మహిళలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. త్వరలోనే మహిళా అధికారులు సైన్యాన్ని నడిపించే స్థాయిలో ఉంటారని, బెటాలియన్లకు నాయకత్వం వహిస్తారని వెల్లడించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 14,348 కరోనా కేసులు, 805 మరణాలు నమోదు
Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ
Also Read: G20 Summit 2021: రోమ్ చేరుకున్న ప్రధాని.. జీ20, కాప్- 26 సదస్సులతో మోదీ బిజీ
Also read: అష్టఐశ్వర్యాలుగా చెప్పుకునేవి ఇవే
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు