AP Covid Vaccination: వ్యాక్సినేషన్‌లో ఏపీ మరో రికార్డు.. మూడు కోట్ల మందికి కనీసం ఒక డోస్..
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు కోట్ల మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది.
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు కోట్ల మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ అందించినట్లు తెలిపింది. ఏపీలోని 6 కోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు మొత్తం 3,00,87,377 డోసులు ఇచ్చినట్లు తెలిపింది. వీరిలో కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,16,64,834గా ఉంది. ఇక రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 84,22,543గా ఉందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి పైగా కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పింది. 21.9 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు పేర్కొంది.
More than 3 Crore doses of #COVIDVaccine were administered so far in #AndhraPradesh.
— ArogyaAndhra (@ArogyaAndhra) August 31, 2021
Out of the total eligible population for Vaccine in #AP, more than 56% is now vaccinated with at least one dose and more than 21.9% with two doses#LargestVaccineDrive #APFightsCorona pic.twitter.com/ao9NM1v4ic
మంగళవారం నాటి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 12,30,517 మందికి వ్యాక్సిన్ అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
In the mega vaccination drive conducted today in #AndhraPradesh, a total of 12,30,517 doses of #COVIDVaccine were administered till 11:00PM.
— ArogyaAndhra (@ArogyaAndhra) August 31, 2021
.
If you are 18+ visit your nearest vaccine centre and get the jab#LargestVaccineDrive #APFightsCorona #Unite2FightCorona #COVID19Pandemic pic.twitter.com/cgDQq6yW0w
కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని డోసుల వ్యాక్సిన్లు వస్తే.. రాబోయే రెండు నెలల్లో మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల సహకారంతోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా శరవేగంగా పేర్కొన్నారు.
Also Read: AP Police: ఏపీలో 40 మంది డీఎస్పీలకు పదోన్నతులు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Also Read: ఏ నెల పింఛను ఆ నెలలోనే.. 2 నెలలది ఒకేసారి ఇవ్వడం కుదరదు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం..