Anantapur: పోలీస్ కాళ్లు పట్టుకున్న రైతన్న - తమకు సాయం చేయాలని వినతి
Tungabhadra News: ఎస్సై కాళ్లు పట్టుకొని ఓ రైతు తాము న్యాయమైన ఆందోళన చేస్తున్నామని.. తమకు సహకరించాలని ఎస్సై కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు.
Anantapuram News: అనంతపురం జిల్లా మిర్చి పంట రైతులు ఆందోళన చేపట్టారు. తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు నిలిపివేయడంతో ఆయకట్టు కింద సాగు చేసుకున్న మిర్చి పంట నష్టం వాటిల్లుతుందని విడపనకంలో మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. హంద్రీనీవా నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు నీటిని మళ్లించాలని రైతులను డిమాండ్ చేశారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు. రైతులను అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నించిన సీఐ కాళ్లు పట్టుకొని ఓ రైతు తాము న్యాయమైన ఆందోళన చేస్తున్నామని.. తమకు సహకరించాలని సీఐ కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు.
ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా తుంగభద్ర డ్యామ్ కెనాల్ ఆయకట్టు కింద సుమారు 30 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. నవంబర్ నెలలోనే కాలువకు నిరు నిలిపివేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట ప్రస్తుతం పూత దశలో ఉందని ఇప్పుడు కనీసం మూడు లేదా నాలుగు తడులు నీరు అందిస్తే తప్ప పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రావని రైతులు ఆందోళన చేపట్టారు. హంద్రీనీవా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కు మళ్ళించాలని విడపనకల్లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలియజేశారు. హంద్రీనీవా నీరు మళ్లించకపోతే సుమారుగా 300 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.