అన్వేషించండి

J&K Terror Attacks: ఉగ్రవేటను తీవ్రతరం చేయండి, అందరినీ మట్టుబెట్టండి - అమిత్ షా ఆదేశాలు

Jammu Kashmir Attacks: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై అమిత్ షా ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు.

J&K Serial Terror Attacks: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు అలజడి సృష్టించాయి. భద్రతా బలగాలు అన్ని చోట్లా అప్రమత్తమయ్యాయి. సున్నితమైన ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. దొడ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎత్తైన ప్రాంతాల్లో నక్కి ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లోని శాంతి భద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఉగ్రవేటను మరింత తీవ్రతరం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అధికారులంతా అమిత్ షాకి జమ్ము కశ్మీర్‌లోని పరిస్థితులను వివరించారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న అమిత్ షా ఆ తరవాతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులను ఏరి పారేయాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని బలగాలను రంగంలోకి దింపి ఉగ్రవాదుల్ని హతమార్చాలాని తేల్చి చెప్పారు. G7 సదస్సుకి హాజరయ్యే ముందు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు మోదీ. ఆ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చించారు. ఇప్పుడు అమిత్ షా కూడా రివ్యూ చేశారు. ఈ సమావేశానికి అజిత్‌ దోవల్‌తో పాటు జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్రహోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా హాజరయ్యారు. 

జూన్ 29వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపైనా సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని ఆదేశించారు అమిత్ షా. ఉగ్రవాదులు అక్రమంగా చొరబాట్లను అడ్డుకోవాలని తేల్చి చెప్పారు. రేసీలో ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ తరవాత కథువా, దొడ జిల్లాల్లోనూ ఈ దాడులు కొనసాగాయి. భద్రతా బలగాలు ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇక ముందు కూడా ఇదే స్థాయిలో ఆపరేషన్‌లు కొనసాగాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 
 

Also Read: Elon Musk: EVMలను ఏ మాత్రం నమ్మలేం, హ్యాక్‌ అయ్యే ప్రమాదముంది - మస్క్ సంచలన వ్యాఖ్యలు, సమర్థించిన రాహుల్

టాప్ హెడ్ లైన్స్

SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?
ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. SBI ఏం చెబుతుందంటే?
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
AP Local Body Election: నామినేషన్ దాఖలు పొడిగింపుపై ఏపీ ఎస్ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నామినేషన్ దాఖలు పొడిగింపుపై ఏపీ ఎస్ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ABP Desam Top 10, 21 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 21 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?
ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. SBI ఏం చెబుతుందంటే?
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
Embed widget