SBI account holders : ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా - నవంబర్ ఒకటి నుంచి ఈ చార్జీలు తప్పవు !
SBI : దేశంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తన ఖాతాదారులపై మరో భారం మోపనుంది. నవంబర్ ఒకటి నుంచి యుటిలిటీ బిల్ పేమెంట్స్ పై ఒక శాతం చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు.
Alert to SBI account holders : డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ యుటిలిటీ పేమెంట్స్ అంటే ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు , గ్యాస్ బుకింగ్ ఇలాంటి పనులన్నీ ఆన్ లైన్‌లో చేసేస్తున్నారు. ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాక.. ఇలాంటి పేమెంట్స్ కూడా చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారా చేసేస్తున్నరు. దీని వల్ల ఎంతో సౌకర్యంగా ఉంటోంది. సరైన సమయానికి జీతం అందకపోయినా... డబ్బులు చేతిలో లేని పరిస్థితి వచ్చినా.. క్రెడిట్ కార్డుతో కట్టేసి బయటపడుతున్నారు. కానీ ఈ ఆనందాన్ని కూడా మధ్యతరగతి జీవులకు ఎక్కువగా మిగిల్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత ఆసక్తిగా లేదు. ఎందుకంటే.. కొత్తంగా ఇలాంటి పేమెంట్స్ పై ఒక శాతం చార్జి విధించాలని నిర్ణియంచింది.
ఎస్‌బీఐ తన అకౌంట్ హోల్డర్లు అందరికీ తాజాగా ఓ మెయిల్ పంపింది. అందులో కొత్త చార్జీల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఎస్బీఐ క్రెడికార్డులను ఉపయోగించి చేసే బిల్లు పేమెంట్స్ పై ఒక శాతం సర్ చార్జి విధిస్తున్నట్లుగా ఆ మెయిల్‌లో తెలిపింది. అయితే ఇందులో కొంత మినహాయింపు ఇచ్చింది. ఒక్క బిల్లు కాలంలో యాభై వేల రూపాయలు అంత కన్నా ఎక్కువ యుటిలిటీ బిల్స్ కట్టే వారిపైనే ఒక్క శాతం చార్జి విధిస్తుంది. అంత కన్నా తక్కువ అయితే ఎలాంటి చార్జి ఉండబోదని ఎస్బీఐ తెలిపింది. అలాగే వివిధ రకాల ఫైనాన్స్ ఉత్పత్తులు అంటే లోన్లు.. ఇతర ఈఎంఐ స్కీమ్స్ పై ఫైనాన్స్ చార్జీలను నెలకు 3.75 శాతం వసూలు చేస్తామని తెలిపింది.
భార్య పేరు చెప్పుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు - లక్షల్లో డబ్బు ఆదా!
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు విషయంలో బ్యాంకు ఇటీవలి కాలంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. క్లబ్ విస్తారా కార్డును ఆపేయాలని నిర్ణయించింది. గత జూన్‌్లో రివార్డు పాయింట్లకు సంబంధించి కొన్ని ఆప్షన్లు తీసేసింది. ప్రభుత్వానికి చేసే ట్రాన్సాక్షన్లకు సంబంధించి రివార్డు పాయింట్లు అందించడం ఆపేసింది. అంటే ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి రివార్డు పాయింట్లు ఇవ్వడం లేదు. జూన్ 1, 2024 నుంచే అమలులోకి వచ్చింది.
దాదాపు అన్ని కార్డుల వినియోగదారులకు గవర్నమెంట్ సంబంధిత ట్రాన్సాక్షన్లపై రివార్డు పాయింట్లు ఉండవు. ఇలా రివార్డు పాయింట్లు కోత విధించడం.. బిల్లు పేమెంట్స్ పై చార్జీలు వేయడం ఎస్బీఐనే ప్రారంభించలేదు. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లపై కోత పెడుతున్నాయి బ్యాంకులు. ఇప్పటికే యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సైతం కొత్త రూల్స్ తీసుకొచ్చాయి. యుటిలిటీ బిల్స్ పేమెంట్లపై ఛార్జీలు తీసుకొచ్చాయి. ఇతర బ్యాంకులు కూడా ఇదే దారిలోకి వెళ్తే కరెంట్ బిల్, వాటర్ బిల్, ఇంటి రెంటు వంటివి పే చేసినప్పుడు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చ.