By: Arun Kumar Veera | Updated at : 08 Oct 2024 06:00 PM (IST)
ఒక్క క్లిక్‌తో వివరాలు తెలుసుకోండి ( Image Source : Other )
Income Tax News: టాక్స్‌పేయర్లూ.. అటెన్షన్ ప్లీజ్. మీపై పడే ఆదాయ పన్ను భారాన్ని తగ్గించడానికి & మీ కోసం లక్షల రూపాయలు ఆదా చేయడానికి మీ భార్య మీ పాలిట దేవతగా మారుతుందని మీకు తెలుసా?. మీరు కొంచం స్మార్ట్‌గా ఆలోచిస్తే, రూల్స్ ప్రకారమే లక్షల రూపాయల్లో టాక్స్ బర్డెన్ నుంచి తప్పించుకోవచ్చు.
ఇన్‌కమ్ పన్ను రిటర్న్స్ (Income Tax Returns) దాఖలుకు గడువు రెండు నెలల క్రితం, 31 జులై 2024న ముగిసింది. అయితే, ఈ గడువును మిస్ అయిన పన్ను చెల్లింపుదార్లకు ఇప్పటికీ ITR 2024 ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి లేట్ ఫీజ్ చెల్లించాలి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), ఈ ఏడాది జులై 23న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ (Union Budget 2024) సమర్పించారు. దురదృష్టం ఏంటంటే, ఆ బడ్జెట్‌లో కూడా పన్ను చెల్లింపుదార్లకు పెద్దగా ఉపశమనం లభించలేదు. కొత్త పన్ను విధానాన్ని ప్రమోట్ చేయడం కోసం, స్టాండర్డ్ డిడక్షన్ (standard deduction) పరిమితిని మాత్రం రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచారు. టాక్స్‌పేయర్లపై సర్కారు దయ చూపకపోయినప్పటికీ ఉసూరుమంటూ నీరసపడిపోనక్కర్లేదు. పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి మన ఉపాయాలు మనకున్నాయి, అదీ అధికారికంగా. ఇందుకోసం, మీ జీవిత భాగస్వామి (భార్య/భర్త) పేరును మీరు నిరభ్యంతరంగా, ఏ మాత్రం మొహమాటం లేకుండా ఉపయోగించుకోవచ్చు.
జీవిత భాగస్వామి పేరిట ఆదాయ పన్నును ఆదా చేసే 7 మార్గాలు:
సెక్షన్ 80సి (Section 80C) కింద మినహాయింపు: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి ప్రకారం, పన్ను చెల్లింపుదార్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్నులు ఆదా చేయొచ్చు. జీవిత భాగస్వామి పేరుతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్ స్కీమ్ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY) సహా చాలా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లక్షన్నర రూపాయలు వరకు పన్ను మినహాయింపులు పొందొచ్చు.
ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు (Tax Exemption on Health Insurance): పన్ను చెల్లింపుదార్లు తమ జీవిత భాగస్వామి (భార్య/భర్త) పేరుతో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసినట్లయితే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద తగ్గింపు కోసం క్లెయిమ్ చేయొచ్చు. వారు ఈ సెక్షన్ కింద రూ. 25,000 వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు.
గృహ రుణంపై పన్ను మినహాయింపు (Tax Exemption on Home Loan): టాక్స్ పేయర్లు తమ జీవిత భాగస్వామి పేరిట తీసుకున్న గృహ రుణంపై వడ్డీ చెల్లింపులపై కూడా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS): నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, సెక్షన్ 80CCD(1B) కింద ఒక ఆర్థిక ఏడాదిలో రూ. 50,000 వరకు టాక్స్ ఎగ్జమ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
విద్యా రుణంపై పన్ను మినహాయింపు (Tax Exemption on Education Loan): మీరు మీ జీవిత భాగస్వామి పేరుతో విద్యా రుణం తీసుకుంటే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద 8 సంవత్సరాల వరకు పన్ను మినహాయింపులు తీసుకోవచ్చు.
ఉమ్మడి గృహ రుణం (Joint Home Loan for Tax Exemptions): జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా గృహ రుణం తీసుకునే జంటలు ఆదాయ పన్ను శాఖ అందించే పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఇక్కడ కూడా లక్షల రూపాయలు ఆదా అవుతాయి.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి (Tax Exemptions In Share Market Investments): షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా, దీర్ఘకాలిక మూలధన లాభాలపై రూ. 1 లక్ష వరకు పన్ను మినహాయింపును ఆస్వాదించొచ్చు. మీ జీవిత భాగస్వామి తక్కువ సంపాదిస్తున్నా, లేదా గృహిణి అయితే, మీరు వారి పేరుతో షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ 7 మార్గాలను ఫాలో అయితే, మీ భార్య/భర్త పుణ్యమాని, ITRలో మీ ఆదాయం అధికారికంగా లక్షల రూపాయలు తగ్గుతుంది. దీనివల్ల మీకు అతి భారీగా డబ్బు సేవ్ అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఓలా ఎలక్ట్రిక్‌కు మరో భారీ దెబ్బ - షోకాజ్ నోటీస్‌తో షాక్ ఇచ్చిన 10 వేల మంది కస్టమర్లు
Indian Currency: డాలర్‌తో రూపాయి మారకం విలువ అంటే ఏంటి, విలువను ఎలా నిర్ణయిస్తారు?
Gold-Silver Prices Today 12 Nov: నెల క్రితం రేటుతో ఇప్పుడు గోల్డ్ కొనొచ్చు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Diwali Stock Picks: ధనలక్ష్మికి ఆహ్వానం పలికే షేర్లు ఇవి - దీపావళి కల్లా కాసుల వర్షం ఖాయమట!
Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Andhra Group 2 : ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే