By: Ram Manohar | Updated at : 02 Dec 2022 05:19 PM (IST)
ఎయిమ్ సర్వర్ హ్యాకింగ్ వెనకాల ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
AIIMS Server Hack:
ఉగ్రవాదుల పనా..?
ఢిల్లీలోని AIIMS హాస్పిటల్ సర్వర్ ఇటీవలే హ్యాక్‌కు గురైంది. వెంటనే సైబర్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై డ్యామేజ్‌ను కొంత వరకూ తగ్గించగలిగారు. అయితే...ఇది ఎవరు చేశారన్నది మాత్రం ఇంత వరకూ ఎలాంటి సమాచారం అందలేదు. దీనిపై...కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ABP Newsకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించారు. "ఈ హ్యాకింగ్‌ను చిన్న విషయంలా తీసుకోకూడదు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర ఉండే ఉంటుంది" అని అన్నారు. సీఈఆర్‌టీతో పాటు ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారని చెప్పారు. ఇలాంటి దాడులు పదే పదే జరగకుండా...ప్రజల వ్యక్తిగత సమాచారం ఎవరి చేతుల్లోకీ వెళ్లకుండా కేంద్రం Digital Data Protection Billను తీసుకొస్తున్నట్టు వివరించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతామని అన్నారు. ప్రతి పౌరుడి వ్యక్తిగత ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఈ బిల్ రక్షిస్తుందని వివరించారు. ఎయిమ్స్ సర్వర్ హ్యాక్‌కు గురైన వెంటనే రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నత స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టారు. త్వరలోనే సర్వర్‌ను రీస్టోర్ చేసి..పనులు సవ్యంగా జరిగేలా
జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక NIA కూడా రంగంలోకి దిగి దీని వెనకాల ఉగ్రకుట్ర ఏమైనా ఉందా ...అనే కోణంలో విచారణ కొనసాగిస్తోంది. కొందరు వీవీవఐపీల డిటెయిల్స్ కూడా ఈ సర్వర్‌లో ఉండటం వల్లే ఇది ఉగ్రవాదుల పనా..? అన్న అనుమానాలకు తావిస్తోంది.
జలశక్తి శాఖ ట్విటర్ అకౌంట్ హ్యాక్..
ఎంత టెక్నాలజీ వచ్చినా...ఎంత సెక్యూరిటీ పెంచుకుంటున్నా...యాప్స్, వెబ్‌సైట్స్ హ్యాక్‌కు గురి కాకుండా చూడలేకపోతున్నారు. ఏకంగా ప్రభుత్వ సోషల్ మీడియా అకౌంట్లనూ హ్యాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన ట్విటర్ హ్యాండిల్ హ్యాక్‌కు గురైంది. ఉన్నట్టుండి అకౌంట్‌లో అనుమానాస్పద ట్వీట్‌లు కనిపించాయి. క్రిప్టో వ్యాలెట్ Sui Walletని ప్రమోట్ చేస్తూ వరుసగా పోస్ట్‌లు వచ్చాయి. ఉదయం 5.38 గంటలకు ఈ ట్వీట్ కనిపించింది. అంతేకాదు. ఆ అకౌంట్ డీపీ త్రివర్ణ పతాకం ఉండగా...దాన్నీ మార్చేశారు హ్యాకర్లు. జెండా స్థానంలో... Sui Wallet లోగోను సెట్ చేశారు. కవర్ పేజ్‌నూ మార్చేశారు. ఈ పోస్ట్‌తో పాటు మరెన్నో గుర్తు తెలియని అకౌంట్‌లను ట్యాగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు...అకౌంట్‌ను రికవరీ చేశారు. పాత పోస్ట్‌లన్నీ డిలీట్ చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు సైబర్ నిపుణులు...దీనిపై పూర్తి స్థాయివిచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవలే నవంబర్ 23న ఢిల్లీలోని AIIMS సర్వర్‌లు ఉన్నట్టుండి పని చేయకుండా పోయాయి. రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ఇవ్వాలని హ్యాకర్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. కానీ... పోలీసులు మాత్రం దీన్ని ఖండించారు. సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు చేసిన పోలీసులు...విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 3-4కోట్ల మంది పేషెంట్ల డేటాను హ్యాకర్లు దొంగిలించినట్టు తెలుస్తోంది.
Also Read: Zika Virus: మళ్లీ టెన్షన్ పెడుతున్న జికా వైరస్, పుణేలో ఓ వ్యక్తికి పాజిటివ్
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ రెడ్డి
Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్
Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?