అన్వేషించండి

Zika Virus: మళ్లీ టెన్షన్ పెడుతున్న జికా వైరస్, పుణేలో ఓ వ్యక్తికి పాజిటివ్

Zika Virus in Pune: పుణేలో ఓ వ్యక్తికి జికా వైరస్‌ సోకింది.

Zika Virus in Pune:

జికా లక్షణాలు..

కొవిడ్, మంకీపాక్స్‌ వైరస్‌లతోనే సతమతం అవుతుంటే...ఇప్పుడు జికా వైరస్ కూడా భయ పెడుతోంది. పుణేలో జికా వైరస్ కేసు నమోదైంది. నవంబర్ 16న పుణేలోని జహంగీర్ హాస్పిటల్‌కు ఓ బాధితుడు అనారోగ్యంతో వచ్చాడు. దగ్గు, నీరసం, జ్వరంతో బాధ పడుతుండడంతో వైద్యులు అనుమానంతో టెస్ట్ చేయించారు. ఈ టెస్ట్‌లో జికా వైరస్ సోకినట్టు తేలింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది పరిసరాల ప్రజలకు పలు సూచనలు చేశారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఆ ఏరియా అంతా వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు చేపడుతోంది. బాధితుడి పరిసరాల్లోని ఇళ్లలోని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెస్ట్‌లు నిర్వహించగా...వేరెవరికీ పాజిటివ్‌గా నిర్ధరణవలేదు. దోమలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావించినా...ఆ ప్రాంతంలో అలాంటి పరిస్థితులేమీ 
లేవు. ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేసి ప్రజలకు సూచనలు చేశారు. బాధితుడు నాసిక్ నుంచి ఇటీవలే పుణేకు వచ్చాడు. అంతకు ముందు అక్టోబర్‌లో సూరత్ వెళ్లొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బాధితుడికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు వెల్లడించారు.  ఈ మధ్యే మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్ గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తలసరి గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా జికా వైరస్ కేసు గతేడాది పుణెలో నమోదైందని.. రెండో కేస్‌ ఇదేనని వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇలా సోకుతుంది..

జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ... ఇప్పటి వరకు దీనకి మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్ సోకడం వల్ల కొందరిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు ఈ జికా వైరస్ సోకినట్లు అయితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టబోయే శిశువు మెదడు సరిగా అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. 1947 ప్రాంతంలో ఈ వైరస్ అడువల్లో ఉండే కోతుల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో తమిళనాడు, అహ్మదబాద్ లలో ఈ కేసులు నమోదైనట్లు తేలింది. దోమ వల్ల జికా వైరస్ సోకుతున్నందును.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో, ఇంటి బయట దోమలు నిల్వకుండా తరచుగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని వివరిస్తున్నారు. ఏదైనా జ్వరం, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏం కాదులే అని ఇంట్లోనే ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దోమలను దరి చేరనీయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు జికా వైరస్ సోకకుండా చేస్తుందని చెబుతున్నారు.

Also Read: Jairam Ramesh on BJP: ఎన్నికలొచ్చినప్పుడే బీజేపీకి యూసీసీ గుర్తొస్తుంది, లా కమిషన్ ఏం చెప్పిందో తెలుసుగా - జైరాం రమేశ్

 

టాప్ హెడ్ లైన్స్

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
ABP Desam Top 10, 19 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 19 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget